Friday, October 18, 2024
spot_img

అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు

తప్పక చదవండి

హైదరాబాద్‌ :అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు అని సినీ నటుడు బ్రహ్మానందం కొనియాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్‌ శతజయంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు, రామ్‌ చరణ్‌, రాజేంద్రప్రసాద్‌, మహేశ్‌ బాబు, రానా, విష్ణు, నాని, దిల్‌ రాజు, రాజమౌళి, కీరవాణి, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఏఎన్నార్‌ విగ్రహావిష్కరణ చూడటమే మహాభాగ్యమని అన్నారు. రైతుకుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి ఏఎన్నార్‌ చేరుకున్నారని బ్రహ్మానందం అన్నారు. అద్భుతమైన స్థితికి చేరుకోవడం సామాన్యమైన విషయం కాదన్నారు. నటన అనే చిన్న అర్హతతో ఏఎన్నార్‌ మహోన్నత వ్యక్తిగా మారారని కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు సర్వసాధారణంగా ఉంటారని, ఆయన క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుందన్నారు. ఏఎన్నార్‌కు వచ్చినన్ని అవార్డులు ఇంకెవరికీ రాలేదని.. ఆయన పొందిన సన్మానాలు ఇంకెవరికీ జరగలేదని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు