Friday, November 1, 2024
spot_img

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు

తప్పక చదవండి
  • పురుగు మందు తాగించి హత్య చేసిన ప్రేమోన్మాది
  • తనను ప్రేమించలేదనే కోపంతో ఓ యువకుడి దారుణం
  • ఇద్దరు పిల్లల తండ్రి అయినా ప్రేమిస్తున్నానని వెంటపడ్డ వైనం
  • ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలో ఘటన

హైదరాబాద్ : తెలంగాణలోని కుమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదనే కక్షతో ఓ యువతిని హత్య చేశాడో వ్యక్తి.. బలవంతంగా పురుగుల మందు తాగించి పారిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే అతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండగా.. గత కొంత కాలంగా ప్రేమిస్తున్నానని యువతి వెంటపడటంతో పాటు ప్రేమను అంగీకరించలేదని తీవ్రంగా కొట్టి పురుగుల ముందు తాగించి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావ్‌పేటకు చెందిన బూడే దీప (19) కూలీ పనులకు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిస్తోంది. ఇంటర్‌ అనంతరం చదువు మానేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్‌ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీపపై కన్నేసిన కమలాకర్.. గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడుతున్నాడు. తనను ప్రేమించకపోతే.. ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబ సభ్యులందరినీ చంపుతానని బెదిరిస్తూ ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం దీప కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లగా.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కమలాకర్ ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ప్రేమించకుండా వేరే వాళ్లతో మాట్లాడుతున్నావంటూ ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం తన వెంట తెచ్చిన పురుగు మందును బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు బయటకు వచ్చి కాపాడాలంటూ చుట్టుపక్కల వారిని కోరగా.. వెంటనే సిర్పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ దీప మంగళవారం ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు