Thursday, October 24, 2024
spot_img

ఇమ్రాన్‌ఖాన్‌ను వెంటాడుతున్న కష్టాలు

తప్పక చదవండి
  • జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించిన ప్రత్యేక కోర్టు
    పాకిస్తాన్‌ : రహస్య పత్రాల లీకేజీ వ్యవహారంలో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 26 వరకు పొడిగించింది. జైలు నుంచి త్వరగా బయటపడాలని భావిస్తున్న ఇమ్రాన్‌ ఆశలకు ప్రత్యేక కోర్టు ఆదేశాలతో గండిపడినట్లయ్యింది. భద్రతా కారణాల నేపథ్యంలో ప్రతాల లీకేజీ కేసు విచారణ అటాక్‌ జైలులో జైలులో జరిగింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కర్నైన్‌ ఆదేశించారు. ఇదే కేసులో ఇమ్రాన్‌ సన్నిహితుడు, విదేశాంగశాఖ మాజీ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ సైతం కస్టడీలో ఉన్నారు.ఆయన కస్టడీనితం ఈ నెల 26 పొడిగించింది. ఈ సమాచారాన్ని పీటీఆర్‌ పార్టీ ఒక సోషల్‌ విూడియా ద్వారా ప్రకటించింది. అయితే, గతేడాది జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ రహస్య ప్రతాన్ని చూపించారు. ఆయాపత్రాలపై విచారణలో ప్రశ్నించగా.. తాను ఎక్కడో పోయిందని దర్యాప్తు సంస్థల ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇమ్రాన్‌ తోషాఖానా కేసులో ఆగస్టు 5 నుంచి పంజాబ్‌లోని అటాక్‌ జైలులో ఉండగా.. అదే నెల 29న ఇస్లామాబాద్‌ హైకోర్టు దిసభ్య ధర్మాసనం ఇమ్రాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.రహస్య ప్రతాల లీకేజీ వ్యవహారంలో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి కోర్టులో విచారణ జరుగాల్సి ఉండగా.. భద్రతా కారణాల నేపథ్యంలో అటాక్‌ జైలులోనే విచారణ జరిపేందుకు ఈ నెల 15న పాక్‌ న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కోర్టులో విచారించకుండా జైలులో విచారించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి మంగళవారం తీర్పును రిజర్వ్‌ చేశారు.అయితే, గతేడాది మార్చిలో ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరిగాయి. ఓ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్‌ ఖాన్‌ తన జేబులో నుంచి ఓ పత్రాన్ని తీసి చూపిస్తూ.. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘అంతర్జాతీయ కుట్ర’ జరిగిందంటూ ఆరోపించారు. అయితే, ర్యాలీలో తాను చూపిందని రహస్య పత్రం అంటూ వచ్చిన ఆరోపణలను ఖండిరచారు. ఈ పేపర్‌ను ఎక్కడో పోయిందని.. ఎక్కడ పెట్టానో గుర్తు లేదని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు