Thursday, September 19, 2024
spot_img

వసుధారాణి సాహిత్య సేవ అభినందనీయం

తప్పక చదవండి

రచయితను సన్మానించిన కలెక్టర్‌

విజయవాడ : తెలుగు భాషాభిద్ధికి,సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న రచయిత్రి రూపెనగుంట్ల వసుధారాణి అభినందనీయురాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ప్రముఖ రచయిత్రి రూపెనగుంట్ల వసుధారాణిని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఘనంగా సత్కరించారు. ఆగస్టు 29వ తేదిన గిడుగు వెంకట రామూర్తి పంతులు జయంతి సందర్భంగా నగరంలోని స్థానిక తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో భాష సాంస్కృతిక శాఖ అధికార భాష సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తెలుగు భాష మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు భాషాభిద్ధికి, సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన 49 మంది కవులు, కళాకారులు, రచయతలను ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. సన్మాన గ్రహీతలలో ప్రకాశం జిల్లా వేటపాలెంకి చెందిన రూపెనగుంట్ల వసుధారాణి ఒకరు కావడం పట్ల అభినందించారు. తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తూ ఆమె రచించిన వాటిలో ‘కేవలం నువ్వే’ ‘దేవకాంచనం నీడన’ ‘నది వెంట నేను అనే పుస్తకాలు ప్రముఖంగా నిలిచాయని వాటితో పాటు రచయత్రి వసుధారాణి పలు పత్రికలకు శీర్షికలు, రచనలు, రాయడం జరిగిందని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.సన్మాన కార్యక్రమంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు