Friday, November 1, 2024
spot_img

చర్చలు కొలిక్కి వచ్చాయి

తప్పక చదవండి
  • కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాఆర్‌టీపీ విలీనం
  • వైఎస్ షర్మిల కీలక కామెంట్స్

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేయడంపై చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్ షర్మిల తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను సోనియాగాంధీ గౌరవిస్తున్నారు కాబట్టే వారితో చర్చలకు వెళ్లానని చెప్పారు. చర్చలు తుది దశకు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. వైఎస్‌ను గౌరవిస్తున్నందువల్లే కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో తాను చర్చలు జరిపినట్లు చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌ పంజాగుట్ట కూడలిలోని ఆయన విగ్రహానికి షర్మిల ఇవాళ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ అవినీతి పాలన అంతం కోసమే తాను సోనియా, రాహుల్‌ గాంధీతో చర్చలు జరిపినట్లు చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించే అంశంపై సుదీర్ఘంగా తాను వారితో చర్చించినట్లు వెల్లడించారు. వైఎస్సాఆర్‌టీపీ నేతలతో మాట్లాడాక విలీనంపై నిర్ణయం చెబుతానని అన్నారు. తనతో నడిచిన వారిని తనతో పాటే నిలబెడతానని అన్నారు. కేసీఆర్‌ పాలన పోతేనే తెలంగాణకు మంచి జరుగుతుందని.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసిరావాలని షర్మిల పిలుపునిచ్చారు. షర్మిల తాజా కామెంట్స్‌తో దాదాపు ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం కావటం ఖాయంగా కనిపిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు