Thursday, September 19, 2024
spot_img

పాత బంగ్లాకు వెళ్ళడానికి రాహుల్ నిరాకరణ..

తప్పక చదవండి
  • అధికారులకు తెలిపిన రాహుల్‌..
  • మరో రెండు అప్షన్లు ఇచ్చిన పార్లమెంటరీ హోసింగ్ కమిటీ..
  • రాహుల్ నిర్ణయం కోసం వెయిటింగ్..

తుగ్లక్‌ లేన్‌లోని అధికారిక బంగ్లాకు వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిరాకరించినట్లు పార్టీ వర్గాలు గురువారం ప్రకటించాయి. ఆ బంగ్లాకు తాను వెళ్లనని పేర్కొంటూ పార్లమెంటరీ హౌసింగ్‌ కమిటీకి ఆయన లేఖ రాసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్‌ ఎంపీ సభ్యత్వాన్ని ఇటీవల లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 12`తుగ్లక్‌ లేన్‌లోని బంగ్లాను తిరిగి ఆయనకే కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తన సమ్మతి తెలియజేయాల్సిందిగా 15 రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువు బుధవారంతో ముగిసింది. అయితే, పాత బంగ్లాకు వెళ్లేందుకు రాహుల్‌ ఆసక్తి చూపలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పార్లమెంటరీ హౌసింగ్‌ కమిటీ ఆయనకు మరో రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. 7 సర్దార్ గంజ్ లేన్‌, 3 సౌత్‌ అవెన్యూ బంగ్లాలు ఎంచుకోవచ్చని హౌసింగ్‌ కమిటీ సూచించినట్లు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు