Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

72 ఏళ్లు పూర్తి చేసుకోవడం ప్రత్యేక సందర్భం

రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): స్వాతంత్య్రం వచ్చి నేటితో 72 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైన సందర్భమని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అన్నారు. 73వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. మరికొన్ని వారాల్లో అక్టోబర్‌ 2న జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు జరుగునున్నాయన్నారు. మహాత్మాగాంధీ కష్టి, పట్టుదల, అకుంఠిత దీక్షతో బ్రిటీష్‌ పాలన నుంచి భారత్‌ కు విముక్తి కలిగిందని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ చెప్పారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌, లఢఖ్‌ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం తో..ఆయా ప్రాంతాల ప్రజలు మెరుగైన భవిష్యత్‌ను అందుకోనున్నారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, వసతులు ఉన్నాయో..ఇక నుంచి జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ ప్రజలు కూడా అన్ని హక్కులు, సౌకర్యాలు పొందుతారని తెలిపారు. ఈ ఏడాది ప్రఖ్యాత సిక్కు గురువు గురునానక్‌ 550వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించుకున్నామని తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close