Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

తెరాసలో 60లక్షల సభ్యత్వాలు

రాష్ట్రంలో తెరాస కంటే బలమైన పార్టీ ఏదీ లేదు

  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌

తెరాస 60 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసుకొన్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. గురువారం పార్టీ నాయకులతో సభ్యత నమోదుపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటితో సభ్యత్వ నమోదు ముగిసిందని వెల్లడించారు. రాష్ట్రంలో తెరాసను మించిన బలమైన పార్టీ లేదన్నారు. భారీగా సభ్యత్వాల నమోదుకు కృషి చేసినందుకు పార్టీ నేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వేలు, వర్థన్నపేటలు ముందువరుసలో నిలిచాయన్నారు. అన్ని జిల్లాల్లో తెరాస పార్టీ కార్యాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని కేటీఆర్‌ సూచించారు. రాబోయే దసరా పండగకు పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలన్నారు. ఆమేరకు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తయ్యేలా స్థానిక నాయకులు దృష్టిసారించాలని సూచించారు. తెలంగాణలో బలమైన పార్టీ ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీనేనని అన్నారు. 60లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ తమదని, టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే పార్టీ తెలంగాణలో లేదని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో భాజపాకు కేవలం 12లక్షల సభ్యత్వాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. మాకు ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కంటే బలమైన పార్టీ ఏదీ లేదన్నారు. పార్టీ చరిత్రలోనే మొదటిసారిగా భారీ సభ్యత్వం నమోదు అయిందన్నారు. క్రియాశీల సభ్యులుగా ఉన్న 20 లక్షల మందికి పార్టీ ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో సభ్యులకు కార్డులను అందిస్తామన్నారు. కమిటీల నిర్మాణం ఆగస్టు 31లోపు పూర్తి చేస్తామన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కమిటీల కూర్పు ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close