రూ.5,999 షావోమి ఫోన్‌..

0

న్యూఢీల్లీ : ప్రపంచంలో ఎక్కువ మంది ఏ స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. తాజాగా కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ 2018కి సంబంధించి గ్లోబల్‌ టాప్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ షావోమి.. అమెరికా టెక్‌ దిగ్గజమైన యాపిల్‌తో పోటీపడుతోంది. టాప్‌ సెల్లింగ్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మి 5ఏ అవతరించింది. శాసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ గెలాక్సీ ఎస్‌9ని కూడా వెనక్కు నెట్టింది. గెలాక్సీ ఎస్‌9 రెండో స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో గెలాక్సీ జే6 ఉంది. ఇక మిగతావన్నీ యాపిల్‌ ఐఫోన్లు. టాప్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్ల జాబితాలో యాపిల్‌ ఎక్స్‌ టాప్‌లో ఉంది. తొలి నాలుగు స్థానాలు ఈ కంపెనీవే. వీటి తర్వాత ఐదో స్థానంలో రెడ్‌మి 5ఏ ఉంది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఇదే బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here