Featuredజాతీయ వార్తలు


అర్ధరాత్రి ఫైళ్ల తారుమారు G


జే ఎం డి శైలజకి బిగిస్తున్న ఉచ్చు
 ఉన్నత స్థాయి కమిటీతో విచారణకు ఆదేశాలు జారీ..?
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) గత రెండు రోజులుగా ఆదాబ్ హైదరాబాద్ లో  వికలాంగుల సహకార సంస్థ జరిగిన అవినీతి అక్రమాల కథనంపై సీఎం కేసీఆర్ మండిపడ్డట్టు తెలిసింది. ఆ మేరకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కి సస్పెండ్ చేసి బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

*వికలాంగుల సహకార  సంస్థ లో నియమనిబంధనలకు తూట్లు
* కోట్ల నిధులు గోల్ మాల్ అయినట్లు ఆరోపణలు.

ఆదాబ్ హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ సర్కారు ముందంజ వేసింది. దివ్యాంగులు సగౌరవంగా బతికేలా వారి సంక్షేమానికి ప్రణాళిక వేస్తు తొలిసారిగా వికలాంగుల సహకార సంస్థ  ద్వారా దివ్యాంగులకు చేయూతనిచ్చే భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా రూ.7.84 కోట్లు(GO Rt No190) వెచ్చించి తెలంగాణ సర్కార్, దివ్యాంగులకు పూర్తి సబ్సిడీతో వివిధ పథకాలను వర్తింపజేస్తున్నారు. సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆగస్ట్ 2018లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించినారు, 500 మోటరైజ్డ్ వాహనాలు దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీ ఆ పై చదువుతున్న వారికి తొలి ప్రాధాన్యంగా వాహనాలు పంపిణీ చేస్తామని సహకార సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్   బి. శైలేజ ప్రకటించారు.
అన్నేక్సుర్-1′ G.O.Rt.No.190,Dept, WCD&SC, తేది 08-11-2017 motorised  వాహనాలు  లబ్ధిదారుల ఎంపిక కొరకు మరియు ఇతర పరికరాల లబ్ది దారుల ఎంపిక కొరకు నియమ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పర్చింది, జిల్లాల వారీగా  లబ్ధిదారుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచింది,,

మోటో రైస్ వెహికల్ పొందుటకు లబ్ధిదారునికి ఉండవలసిన అర్హతలు
1 వికలాంగ విద్యార్థి డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదువుతూ ఉండాలి,2. విద్యార్థి రెగులర్గా తరుగుతున హాజరు కావాలి,  3.మొదటి  ప్రాధాన్యత రెండు కాళ్లల్లో వైకల్యంతో బాధపడుతున్న వారికి, రెండో  ప్రాధాన్యత ఒక కాలు వైకల్యంతో బాధపడుతున్న వికలాంగ విద్యార్థికి ప్రాధాన్యం ఇవ్వాలి.4.  దారిద్య్రం రేఖకు దిగువ ఉన్న విద్యార్థులకు, పట్నంలో అయితే రెండు లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం మించకూడదు, గ్రామీణ ప్రాంతంలో అయితే రూపాయలు 1,50,000 దానికి లోబడి ఉండాలి5.సర్టిఫికెట్ ప్రకారం 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి, 6.గతంలో డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , మరి ఏ ఇతర ప్రభుత్వ శాఖల నుండి లబ్ధి పొందని విద్యార్థులకు ,7.పూర్తి సబ్సిడీతో వాహనాలు అందించాలి,
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం వికలాంగ విద్యార్థుల అభ్యున్నతికి  అర్హతలు కలిగి ఉన్న వికలాంగ విద్యార్థులకు నష్టం జరగకుండా నియమ నిబంధనలను ఏర్పరిస్తే, వికలాంగుల సహకార సంస్థలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ,  అధికారులు కలిసి స్వార్థ ప్రయోజనాల కోసం నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ అర్హత లేని విద్యార్థులకు , జిల్లా కమిటీ నిర్ణయించి పంపించిన లబ్ధిదారులు కాకుండా అన్న రోజుల నుండి 10 వేల నుండి 15 వేల వరకు డబ్బులు తీసుకొని లబ్ధిదారుల లిస్టులో వారి పేర్లు పొందుపరిచి మోటరైస్డ్ వాహనాలు అందించినారు, ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారంతో బట్టబయలయింది, వాస్తవాలు గమనించుటకు విచారణ చేపట్టగా 398 మోటు రైస్ వాహనాలు ఇచ్చిన వాటిలో ఎక్కువ శాతం అనర్హులకు కేటాయించినట్టు తేలిపోయింది, కాలేజీలో చదువుతున్నట్లు బోన ఫైట్ సర్టిఫికెట్లు,ఇన్కమ్ సర్టిఫికెట్ లు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్స్, కాలేజీ నుండి కవరింగ్ లెటర్,  వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అని తేలిపోయింది. కనీసం కాలేజీలో అడ్మిషన్ లేని విద్యార్థులకు , ఫిజియోథెరపీ డాక్టర్లకు, పాల వ్యాపారస్తులకు, ఎప్పుడో చదువుతున్న విద్యార్థులకు, చదువులేని వారికి కూడా మోటర్ motorised వాహనాలు ఇవ్వడం జరిగింది,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కొరకు కేటాయించిన 7.84 కోట్ల రూపాయలు తో వికలాంగ విద్యార్థులకు  వెచ్చించి దివ్యాంగులకు వివిధ పథకాలను వర్తింపజేస్తున్నారు. వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మోటరైస్డ్  వెహికల్స్, ట్రై సైకిల్స్, కృత్రిమ అవయవాలు , బ్యాటరీ వీల్ చైర్స్, లాప్ టాప్స్ ,ఎంపీ 3 ప్లేయర్స్,డైసీ ప్లేయర్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ బుక్స్, ఇయర్రింగ్స హెడ్స్, 4జి స్మార్ట్ ఫోన్స్, టెక్నికల్& లెర్నింగ్ మెటీరియల్, వీల్ చైర్ ఉపకరణాల పంపిణీ చేసే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టి కెసిఆర్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోరుతుంటే వికలాంగుల సహకార సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ ప్రభుత్వం కేటాయించి నిధులను దుర్వినియోగం చేస్తూ  దివ్యాంగుల అందించవలసిన ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలకు పాల్పడి నాణ్యతలేని ఉపకరణాలు అందించే సంస్థలకు టెండర్లు ఖరారు చేసి, ఒప్పందం కుదుర్చుకొని టెండర్లు కేటాయించారని వికలాంగ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు వరకుపూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఎంపిక చేయకుండా కాలయాపన చేస్తూ,సుషీల్ మోటార్స్ వారికి 465 వాహనాలకు సరఫరాకు ఆర్డర్ ఇవ్వగా , లబ్ధిదారులకు మాత్రం ఇప్పటివరకు వాహనాల పంపకం చేసింది 398 మాత్రమే( సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారం ప్రకారం)వాటిలో కూడా సమభాగం   అర్హులైన లబ్దిదారులకు కాకుండా అనర్హులకు కేటాయించారు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవంగా వికలాంగుల సహకార సంస్థ జాయిన్ మేనేజింగ్ డైరెక్టర్  500 motorised వాహనాలు పంపకం చేస్తున్నట్లు ప్రకటించారు కానీ సుశీల్ మోటార్స్ వారికి ఆర్డర్ ఇచ్చింది మాత్రం 465 వాహనాలు మాత్రమే మిగతా 35 వాహనాలు సంగతి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి.

వికలాంగుల సహకార సంస్థలో సేవా దృక్పథంతో, అంకిత  భావంతో విధులు నిర్వహించవలసిన అధికారులు, సిబ్బంది దానికి విరుద్ధంగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ , జూనియర్ అసిస్టెంట్ పి సంపత్ కుమార్, అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతూ,  వికలాంగుల సహకార   సంస్థకు  , వికలాంగుల సంక్షేమం కోరే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తున్నారని  వికలాంగ సంక్షేమ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని కోరినా కూడా వారి అవినీతి బట్టబయలు అవుతుందని పూర్తి సమాచారం ఇవ్వకుండా అసంపూర్తి సమాచారం ఇవ్వడం, సమాచార హక్కు చట్టం అండర్ సెక్షన్ 4(1)(b)ప్రకారము వెబ్ సైట్ లో పూర్తి సమాచారం పెట్టకుండా యదేచ్ఛగా అవినీతికి పాల్పడుతూ, అర్హులైన దివ్యాంగుల విద్యార్థులకు పరికరాల పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని దివ్యాంగ విద్యార్థి  నాయకులు ఆరోపిస్తున్నారు.

వంశరాజ్ రామ్ చంద్ర వికలాంగుల రాజ్యాధికార ఫోరమ్ నాయకుడు
దివ్యాంగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం కేటాయించిన నిధులను స్వాహా చేస్తూ,అవినీతికి పాల్పడుతున్న వికలాంగుల సహకార సంస్థ అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close