0


టీడీడీ
చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి…. అర్చకుల ఆశీర్వచనాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నూతన చైర్మన్‌గా నియమితులు కానున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని టీడీడీ వేద పండితులు, అర్చకులు మర్యాద పూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి వచ్చిన దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, అర్చకులు గోవిందరాజు దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానం తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు ఆశీర్వచనాలు చేశారు. ఈ సందర్భంగా వారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అండదండలతో దేవస్థాన పాలకమండలి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ప్రధానంగా అర్చకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here