Featuredస్టేట్ న్యూస్

హైదరాబాద్‌ నుంచి మేడారానికి 500 బస్సులు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో అతి పెద్ద గిరిజన సంబురాలు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆర్టీసీ రెడీ అయిపోయింది. ఈ సందర్భంగా 500ప్రత్యేక బస్సులను కేటాయించారు. హైదరాబాద్‌లోని పలు కీలక జంక్షన్ల నుంచి బస్సులు బయల్దేరనున్నాయని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎంజీబీఎస్‌ లో విూడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ సేవలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద మేడారం జాతరకు గతేడాది కంటే ఎక్కువ బస్సులు నడపనున్నాం. 375 బస్సుల నుంచి 500 వరకూ బస్సులు నడిపిస్తాం. జాతర నిర్వహించే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 500 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంటాయి.

మెయిన్‌ బస్‌స్టాప్‌లు అయిన ఎంజిబిఎస్‌, జెబిఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్‌, జగదీర్‌గుట్ట, కెపిహెచ్‌బి, మియాపూర్‌, లింగంపల్లి, లాల దర్వాజ, మహంకాళి టెంపుల్‌ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. డిపో మేనేజర్‌స్థాయి అధికారులు మేడారంలోని ప్రత్యేక పాయింట్లలో ఉండి ప్రయాణికుల సౌకర్యాలు చూస్తారని తెలిపారు. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా నగరంలో ఏ ఒక్క ప్రాంతం నుంచైనా 50మంది ప్రయాణికులు మేడారం జాతరకు వెళ్లాలనుకుంటే అక్కడి నుంచే బస్సు నడిపేందుకు సిద్ధంగా ఉణ్నట్లు తెలిపారు. జనవరి 26న మేడారానికి అధికంగా భక్తులు వెళ్తున్నందున నగరంలోని అన్ని పాయింట్ల నుంచి 40 ప్రత్యేక బస్సులను నడుస్తాయని చెప్పారు. మేడారం జాతరకు ఫిబ్రవరి 2న 30 బస్సులు, 3న 35, 4న 40, 5న 100, 6న 120, 7న 140, 8న 35 బస్సులను నడుపుతామని ఆర్‌ఎం వరప్రసాద్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ రిజర్వేషన్‌ కోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఉంటుందని వెల్లడించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close