0

స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ గా డాక్టర్. వై. సంజీవ కుమార్ చేస్తున్న సేవ కార్యక్రమాలను తెలంగాణ కల్చర్ & లివింగ్ ఆర్ట్స్ గ్లోబల్ ఆర్గనైజషన్ వాళ్ళు గుర్తించి సేవ రత్న విభూషణ్ అవార్డు ని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ శ్రీ టి. పద్మారావు చేతులమీదుగా సన్మానం చేయించి అందించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చర్ & లివింగ్ ఆర్ట్స్ గ్లోబల్ ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ బి.మణిమంజరిసాగర్ , స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని , సభ్యులు: గణేష్ తదితరులు పాల్గొన్నారు.
సేవ చేయడం లో నిజాయితీ ఉంటె ఎన్నో అవార్డ్స్ వెతుకుంటూ వస్తాయి అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనము. ఈ అవార్డు రావడం వాళ్ళ మా బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది. అలానే తెలంగాణ రాష్ట్రము లో రోడ్ల పక్కన దిక్కు మొక్కు లేకుండా ఎందరో అభాగ్యులు ఉన్నారు. వాళ్ళ అందరికి కొత్త జీవితాన్ని ఇచ్చి ఆదుకోవలసిందిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ. టి. పద్మారావు ని
డాక్టర్. వై. సంజీవ కుమార్ కోరడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here