చీకటి ఆధ్యానికి 44ఏళ్లు

0

ప్రజల సహకారంతో నవభారత్‌

  • మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన
  • భారత్‌ను పెద్ద జైలుగా మార్చిన ఇందిర
  • రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో మోడీ

న్యూఢిల్లీ :

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా సభను సమర్థవంతంగా నడుపుతున్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యం. మా ఐదేళ్ల పనితనానికి 2019 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మోదీ చెప్పారు. 2014లో పేద ప్రజల అభివృద్ధే మా లక్ష్యమని ప్రకటించా. ప్రజలకిచ్చిన హావిూలన్నింటిని నెరవేరుస్తాం. దేశప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌ సభలో మోదీ మాట్లాడుతూ..ప్రజల సంక్షేమం, సంరక్షణ తదితర అంశాలపై రాష్ట్రపతి ప్రసంగంలో వివరించారన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన సభ్యులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభకు ఎన్నికైన కొత్త సభ్యులు కూడా అద్భుతంగా మాట్లాడారన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరముందని ప్రధాని అన్నారు. విపక్ష కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌లకు భారతరత్న పురస్కారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని తమ ప్రభుత్వం భారతరత్నతో గౌరవించిందని గుర్తుచేశారు. ఇందిర హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి దేశ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆమె పాలనా కాలంలో భారత్‌ను పెద్ద జైలుగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేలవిడిచి సాము చేసిందని.. మన్మోహన్‌ సింగ్‌ పాలనను కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికీ పొగడలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి పాలనపై కనీస అవగహాన లేదని.. ఇతర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని వారు గుర్తించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని అన్నారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి అధికారం అప్పగించి నందుకు ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల, మహాపురుషుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మోదీ స్పష్టం చేశారు. నూతన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమర్థవంతంగా సభను నడుపుతున్నారని కితాబిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష సభ్యులు చేసిన సలహాలను స్వీకరిస్తామని ప్రకటించారు. సభలో మోదీ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఆయన మాటలను ఆమోదిస్తూ.. బల్లలు చరుస్తూ.. సభ్యులంతా పూర్తి సంఘీభావం తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అందించిన సుపరిపాలనకు ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశానికి సేవచేసేందుకు అనేక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నామని, దేశ ప్రగతి కోసం అనేక విధాలుగా ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని, ఓటు వేసేముందు ప్రజలు అనేక విధాలుగా ఆలోచించి తమకు ఓటు వేశారని మోదీ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ముఖ్యంకాదని, దేశ అభివృద్ధికి విపక్షాలు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. ప్రతి పౌరుడు తన హక్కుల కోసం పోరాడాలి. మా ప్రభుత్వం పేదవారందరికీ అంకితమని 2014లోనే స్పష్టం చేశాం. వారికిచ్చి అనేక హావిూలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. పేదరిక నిర్మూలనకు మరింత కృషి చేస్తాం. రోడ్ల నుంచి అంతరిక్షం వరకూ గడిచిన ఐదేళ్లలో దేశం ఎన్నో లక్ష్యాలను చేరుకుందని అన్నారు.

ఎమర్జెన్సీ వీరులను స్మరించుకున్న ప్రధాని

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో 1975లో విధించిన అత్యవసర పరిస్థితిని ప్రతిఘటించిన వారందరినీ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం స్మరించుకున్నారు. ఈ ఘటనతో భారత ప్రజాస్వామ్య విలువ, గొప్పతనం నిరూపితమైందన్నారు. ఎప్పటికైనా నియంతృత్వవాదంపై ప్రజాస్వామ్యమే గెలుస్తుందని రుజువైందని మోదీ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ విధించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా.. ఆనాటి వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అలాగే కేంద్ర ¬ంశాఖమంత్రి అమిత్‌ షా కూడా ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. వార్తా పత్రికలపై ఉక్కుపాదం మోపి, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసిన రోజు అది అని అన్నారు. రాజకీయ లబ్ది కోసం ఆనాటి అధికార పక్షం దేశ ప్రజాస్వామ్యాన్నే హత్య చేసిందన్నారు. ఈ ఘటనతో చెల్లాచెదురైన వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడం కోసం అనేక మంది ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చిందన్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఎమర్జెన్సీ నాటి వీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. జూన్‌ 25, 1975న ఎమర్జెన్సీ విధింపు, తదనంతర పరిణామాలు దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఇలాంటి రోజున మన దేశానికి రక్షణగా నిలుస్తున్న కేంద్ర సంస్థలు, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని ట్వీట్‌ చేశారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను స్మరించుకొని అప్పటి వీరుల త్యాగాలను కొనియాడారు. ఎమర్జెన్సీలో ఆనాటి నాయకులను నాటి ప్రధాని ఇందిరాగాంధీ జైళ్లో వేశారు. జయప్రకాశ్‌ నారాయణ, జార్జి

ఫెర్నాండెజ్‌, అద్వానీ, వెంకయ్యనాయుడు లాంటి మహామహులు జైలులో గడిపారు. జెపి సారధ్యంలో జరిగిన ప్రజలాస్వామ్య పోరులో జనతా పార్టీ ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన తరవాత ఎమర్జెన్సీని ఎత్తేశారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here