బిజినెస్

వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొంతసేపు ఊగిసలాటలో కొనసాగి క్రమంగా దిగజారాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 188 పాయింట్లు నష్టపోయి.. 40,966 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 12,060 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.30 వద్ద కొనసాగుతోంది. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగానే మార్కెట్లు దిగజారినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ పెట్రోలియం, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభాల్లో పయనించగా.. వేదాంత, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటర్స్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close