25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్‌…

0

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్‌ను శనివారం ఏర్పాటు చేశారు. తన మంత్రి మండలి కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయానికి అగ్రప్రాధాన్యం కల్పించారు. దాదాపు 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం ద్వారా ఆయన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మంత్రి మండలిలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రాంతీయ సమతౌల్యం పాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here