Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

బంగారు తెలంగాణకు 16 డిమాండ్లు

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. దిల్లీలోని 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని కేసీఆర్‌ కోరారు. దీంతో పాటు పలు రాజకీయ అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సష్టించిన తర్వాత రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌ దిల్లీకి వెళ్లి ప్రధానిని కలుసుకున్నారు. ఈ భేటీలో ప్రధానికి సుమారు 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కేసీఆర్‌ అందజేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ప్రధానికి కేసీఆర్‌ అందజేసిన వినతిపత్రంలో కొన్ని ముఖ్యాంశాలు..

– తెలంగాణలో నూతన సచివాలయం, నూతన అసెంబ్లీ నిర్మాణానికి బైసన్‌ పోలో భూములను ఇవ్వాలి. అలాగే రక్షణ శాఖకు చెందిన భూములు, పరిసరాల్లో రోడ్ల విస్తరణ చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలి.

– కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలి.

-హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.

-కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.

– హైదరాబాద్‌లో ఐఐఎస్‌ఈఆర్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి.

– ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి.

– జహీరాబాద్‌లో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుఫేక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు అవకాశం కల్పించాలి.

– కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేయాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో ఉంది గనక వెంటనే మంజూరు చేయాలి.

– కష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, నదీ జలాల పంపకంలో నెలకొన్న వివాదాలను ముగించేలా చొరవ చూపాలి.

– కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. అందుకు తగినట్టుగానే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలి.

– ఏపీ విభజన చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలకు సంబంధించి వెంటనే విభజన ప్రక్రియను పూర్తి చేయాలి. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను అవకాశం ఉన్నంత త్వరగా నెరవేర్చాలి.

– గిరిజన విశ్వవిద్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలి.

– వెనుకబడిన జిల్లాలకు ఏటా ఇచ్చే రూ.450 కోట్లు వెంటనే విడుదల చేయాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close