Featuredక్రైమ్ న్యూస్

‘సన్ ‘గా రూ.150 కోట్ల దోపిడీ

(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

అతను ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యా యుడు. డబ్బు విూద ఆశతో కొత్త అవతారం ఎ త్తాడు. ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా ఏడు కంపెనీలను సృష్టించాడు. కాగితాలపై కోట్ల రూ పాయల ఆదాయం సృషించాడు. 2015లో ప్రస్థా నం ప్రారంభించి ‘కలిస్తే.. గెలుస్తాం’ అనే నినా దం చేపట్టాడు. గొలుసు వ్యాపారం ఘనంగా చేశాడు. లక్షకు లక్ష, లేదా వడ్డీ… అంటూ ఎర వేశాడు. వేలాదిమంది నుంచి 150 కోట్లు కొల ్లగొట్టాడు. ఆయన చేసే కార్యక్రమాలకు ఓ ఫోన్‌ కాల్‌ తో రాజకీయ నాయకులు, సినీతారలు అలా వచ్చి.. ఇలా వెళతారు. ఎట్టకేలకు.మోసం బయ టపడింది. శుక్రవారం అరెస్ట్‌ అయ్యాడు ప్రబుధ్దు డు. ఆయన పేరే మెతుకు రవీందర్‌.

ఇదీ ప్రస్థానం: సిద్దిపేట్‌ జిల్లా, రెవల్లిలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాద్యాయ వృత్తి. అనంతరం ఆ ఉద్యోగానికి సెలవు పెట్టాడు. స్పెక్ట్రా బిల్డింగ్‌, బ్లాగ్‌ కంపెనీలలో రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటుగా కొంతకాలం పనిచేశాడు. డబ్బు. బాగానే వస్తున్నా.. సంతృప్తి చెందలేదు. దీంతో తన సన్నిహిత సహచరులు, బంధువుల పేరిట తన సొంత సంస్థను ఓ పథకం ప్రకారం ప్రారంభించాడు.

ఇదీ కంపెనీల జాబితా: మెతుకు రవీంద్ర ప్రారంభించిన 7 కంపెనీలు ఇవి. అందులో తన సన్నిహితులను చైర్మైన్లుగా చూపాడు.

1) 2015 లో బంగ్లా శంకర్‌ పేరు చైర్మన్‌ గా

సన్‌ మ్యూచువల్‌ ఎయిడెడ్‌ థ్రుఫ్ట్‌ క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌.

2) కరుణాకర్‌, మౌనికా డైరెక్టర్లుగా ‘సన్‌ పరివార్‌ మేనేజ్‌ మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.

3) నగేష్‌, కవితా డైరెక్టర్లుగా ‘మెతుకు చిట్‌ ఫండ్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌’.

4) పి. నాగేష్‌, జె. చరణ్‌ టీజ్‌ డైరెక్టర్లుగా ‘మెతుకు వెంచర్స్‌ లిమిటెడ్‌’.

5) పి.నగేష్‌, జె. చరణ్‌ తేజ్‌, ప్రభుదాస్‌ డైరెక్టర్లుగా ‘మెతుకు హెర్బల్‌ లిమిటెడ్‌’.

6) పపగారి నగేష్‌, పులంగరి కవిత

డైరెక్టర్లుగా ‘మెతుకు మెడికల్‌

అండ్‌ హెర్బల్‌ ఫౌండేషన్‌’.

7) పాపగరి నగేష్‌, పులంగరి కవితతో

డైరెక్టర్లు’గా ‘మెట్‌ సన్‌ నిధి లిమిటెడ్‌’

మార్కెటింగ్‌ డైరెక్టర్లు థాలరీ రాజేంద్ర ప్రసాద్‌, అర్రామ్‌ కిషోర్‌ వినియోగదారుల నుండి డిపాజిట్లుగా భారీ మొత్తాలను సేకరించేందుకు కీలక పాత్ర పోషించారు. ఈ కంపెనీల సిఇఓ గా మెతుకు రవీందర్‌ కథంతా నడిపించాడు. ప్రజల నుంచి రూ. 150 కోట్ల మేరకు డబ్బు లాగించాడు. ఈయన నిర్వహించిన కార్యక్రమాలలో గతంలో డిప్యూటీ స్పీకర్‌ గా పనిచేసిన పద్మా దేవేందర్‌ రెడ్డి, సినీతార పూనంకౌర్‌ తదితరులు హాజరయ్యారు.

విదేశీ టూర్ల ఎర: ఇందులో పెట్టుబడులను తెచ్చే మార్కెటింగ్‌ ఏజెంట్‌ ఈ లక్ష్యాలను చేరుకున్నప్పుడు గోవా, షిమ్లా, బ్యాంకాక్‌, దుబాయ్‌ వంటి పర్యటనలు వంటి ప్యాకేజీలను అందించింది. ఈ విషయంపై సైబరా బాద్‌, ఆర్థిక వ్యవహారాల శాఖ అధికారులకు పిర్యాదు అందటంతో మెతుకు రవీందర్‌ ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

సైబరాబాద్‌ పోలీ సు కమిషనర్‌ వి.సి.స జ్జనార్‌ ఈ కేసును పరిశోది óంచిన గోపీనాథ్‌, ఇన్స్పెక్టర్లు గోపీనాథ్‌, విజయ్‌, ఇతర సిబ్బంది హన్మంతు, శ్రీను, కిషోర్‌, రామ్‌ ప్రసాద్‌, దీపక్‌, రమేష్‌, దినేష్‌, రతన్‌ లను ఆయన అభినందించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close