1,13,000 రైల్వే ఉద్యోగాలు

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఇప్పటికే నోటిపికేషన్‌ జారీ చేసి…అర్హతగల అభ్యర్థులకు ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఇప్పటికే నోటిపికేషన్‌ జారీ చేసి…అర్హతగల అభ్యర్థులకు ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నియామకాలకు సంబంధించిన కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా స్పందించారు. ఆయన తన అధికారికి ట్విట్టర్‌ ద్వారా ఈ విధంగా ట్వీట్‌ చేశారు. ”నూతన సంవత్సరంలో మోదీ ప్రభుత్వం అందిస్తున్న కానుక: ఇప్పటికే తమ ప్రభుత్వంలో భారతీయ రైల్వేలో లక్షకు పైగా ఉద్యోగ నియామకాలను చేపట్టింది.

అంతటితో ఆగకుండా దేశ యువకుల కోసం  మరోసారి 13 వేలకు పైగా ఉద్యోగ నియామకాలను త్వరలో రైల్వే శాఖ చేపట్టనుంది'' అంటూ గోయల్‌ తెలిపారు. మొత్తంగా ఇండియన్‌ రైల్వేస్‌ లో ఖాళీగా వున్న జూనియర్‌ ఇంజనీర్‌ (జెఇ), జూనియర్‌ ఇంజనీర్‌ (ఐటి), డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ 13,487 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.  జూనియర్‌ ఇంజనీర్‌12844, జూనియర్‌ ఇంజనీర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)  29, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ 227, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ 387 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లు, జనవరి 31 వరుకు అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం కోసం రైల్వే రిక్రూట్‌ మెంట్‌ బోర్డు అధికారిక వెబ్‌ సైట్‌ ను సంప్రదించవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. 

మగాళ్ళకు మాత్రమే కొన్ని రకాల ఉద్యోగాలు ఆడవారికి లేవు

కఠినమైన, అనుకూల పని వాతావరణం లేని కొన్ని ఉద్యోగాల్లో మహిళలను తీసుకోకపోవడమే మంచిదని భారత రైల్వేశాఖ భావిస్తోంది. డ్రైవర్లు, పోర్టర్లు, గార్డులు, ట్రాక్‌మెన్‌ లాంటి పోస్టుల్లో కేవలం పరుషులనే తీసుకునేలా అనుమతి ఇవ్వాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రయినింగ్‌ విభాగానికి లేఖ రాసింది. ఇటువంటి ఉద్యోగాల్లో మహిళలకు సరైన భద్రత లేకపోవడమేగాక, కఠినమైన పనులు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. రైల్వే శాఖలో 13లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య 2 నుంచి 3 శాతం మాత్రమే. వీరిలో చాలా మంది డెస్కుల్లో, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తుండగా.. డ్రైవర్‌, గార్డులు, పోర్టర్లు, ట్రాక్‌మెన్ల పోస్టుల్లోనూ కొందరు మహిళలు ఉన్నారు. అయితే మహిళల పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని, కానీ కొన్ని పోస్టుల్లో విధుల సమయంలో వీరికి సరైన భద్రత ఉండట్లేదని, పని వాతావరణం కూడా సానుకూలంగా లేదని రైల్వేశాఖ అభిప్రాయపడుతోంది. అందుకే ఇలాంటి పోస్టుల్లో పురుషులను మాత్రమే తీసుకోవాలని యోచిస్తోంది. డ్రైవర్‌లు సాధారణంగా ఒక రైళ్లో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇక గార్డులు సిగ్నళ్లు ఇచ్చేందుకు రైలు చివరి బోగిలో ఉంటారు. పోర్టర్లు రైల్వే స్టేషన్లలో బరువైన లగేజీలను ఎత్తాల్సి ఉంటుంది. రైల్వే ట్రాక్‌లను పరిశీలించేందుకు ట్రాక్‌మెన్‌లను నియమిస్తారు. అయితే దీనిపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రయినింగ్‌ విభాగం ఇంతవరకూ స్పందించలేదు. కాగా.. రైల్వే ఉద్యోగుల యూనియన్‌ మాత్రం దీన్ని తప్పుబడుతోంది. ‘రైల్వేల్లో మహిళలకు సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. అందుకే మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు రైల్వేశాఖ సుముఖంగా లేదు. మహిళలను తీసుకోకుండా ఉండే బదులు.. వారికి సదుపాయాలను మెరుగుపరిస్తే బాగుంటుంది’ అని ఉద్యోగ యూనియన్‌ సభ్యులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here