9న ‘100’ రిలీజ్‌

0

ఆరా సినిమాస్‌ బ్యానరుపై కావ్యా వేణుగోపాల్‌ నిర్మాణంలో అధర్వ, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘100’. శ్యామ్‌ ఆంటన్‌ దర్శకత్వం వహించారు. దీనిని 3వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే కొన్ని కారణాలతో 9వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్‌ మాట్లాడుతూ విక్రంవేదా, అడంగామరు, 100, అయోగ్య ఇలా వరుసగా పోలీసు చిత్రాలకు సంగీతం సమకూర్చుతున్నా. అయితే ఈ అన్ని సినిమాల్లో స్కీన్ర్‌ప్లే చాలా భిన్నంగా ఉంటుంది. ఆ కోవలో 100 చిత్రం తప్పకుండా ప్రత్యేకతను చాటుకుంటుంది. అధర్వ నటన, శ్రమను చూసి ఆశ్చర్యపోయా. అందరికీ నచ్చే చిత్రంలా ఇది ఉంటుందని పేర్కొన్నారు. దర్శకుడు శ్యామ్‌ ఆంటన్‌ మాట్లాడుతూ అధర్వకు కథ చెప్పేటప్పుడు చాలా సీరియస్‌గా విన్నారు. చెప్పడం పూర్తయిన వెంటనే తప్పకుండా నటిస్తానని అనేశారు. కథ కన్నా ఆయన శ్రమే ఇందులో పెద్ద బలం. మహిళల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకు తగ్గ సమాధానంగా ఈ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. అధర్వ మాట్లాడుతూ ‘ఇప్పుడు చాలా పోలీసు చిత్రాలు వస్తున్నాయి. అందులో ‘100’ చాలా భిన్నంగా ఉంటుందని నమ్ముతున్నా. నా పాత్ర కూడా కొత్తగా ఉంటుంది. పోలీసుశాఖ కంట్రోల్‌ రూమ్‌ నేపథ్యంలో కథ నటుస్తుంది. సమాజంలోని సమకాలీన అంశాలను ఎక్కువగా ప్రస్తావించాం. తప్పకుండా ఇది నా కెరీర్‌లో ఓ కీలకమైన చిత్రంగా ఉంటుందని’ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here