Featuredరాజకీయ వార్తలు

నన్ను ఓడించేందుకు వంద కోట్లు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గురువారం బోధన్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బకాసు రుడు, రావణాసురుడు కలిస్తే ఒక కేసీఈర్‌ అవు తాడు.. సెలబ్రిటీల కుక్కలు పెంచుకోడానికి జూబ్లీ హిల్స్‌లో మూడు ఎకరాలు కేటాయించాడు కానీ, తెలంగాణ బిడ్డలకు ఇందిరమ్మ ఇల్లుకట్టుకోడానికి 50 గజాల జాగా ఇవ్వలేదని విమర్శించారు. తాజాగా శుక్రవారం మరోసారి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రెండు రోజుల కిందట హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సుమోటాగా స్వీకరించి, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.28 లక్షలకు మించరాదని నిబంధన ఉండగా, కేసీఆర్‌ రూ.10 కోట్లు ఇస్తానని స్వయంగా మంత్రి నాయిని చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుని, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేయాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. ముషీరాబాద్‌ టికెట్‌ను తనకు లేదా తన అల్లుడికి కేటాయించాలని సీఎంను నాయిని కోరగా, ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేయాలని సూచించిన కేసీఆర్‌…అక్కడ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు వీలుగా రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని నాయిని ప్రస్తావించారని రేవంత్‌ పేర్కొన్నారు. అధికార పార్టీ డబ్బుతో గెలవాలనుకుంటోందని తాము చేసిన ఆరోపణలు అక్షరాలా నిజమయ్యాయవనడానికి ఇదే తార్కాణమని రేవంత్‌ ధ్వజమెత్తారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆరంభం నుంచి వెన్నంటే ఉన్న నాయినిక

ి నెల రోజులుగా కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం అవమానం కాదా అని రేవంత్‌ నిలదీశారు. తెలంగాణలోని నియోజక వర్గానికి రూ. 10 కోట్లు, తన నియోజకవర్గం కొడంగల్‌లో రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉందని ఆరోపించారు. కేసీఆర్‌ అక్రమ సంపాదన రూ.25 వేల కోట్లు మేర ఉంటుందని తాము చేస్తున్న ఆరోపణలు నిజమని మరోసారి రేవంత్‌ దుయ్యబట్టారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై కాకుండా ముఖ్యమంత్రి ఉంటున్న ప్రగతిభవన్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎంపీ కవిత ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

నాకు సెంట్రల్‌ సెక్యురిటీ కావాలి!…తనకు సెక్యూరిటీ కావాలని, కేంద్ర సెక్యురిటీ సంస్థల ద్వారా సెక్యురిటీ కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. శనివారం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిశారు. ఈ సందర్భంగా తనకు సెక్యురిటీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రేవంత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉందని, రాష్ట్ర డీజీపీపై నమ్మకం లేదని అందుకే కేంద్ర సెక్యురిటీ సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ గతంలో నాగార్జున సాగర్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీ శిక్షణలో పాల్గొన్నారని రేవంత్‌ పేర్కొన్నారని, కాబట్టి ఆయనపై నమ్మకం లేదన్నారు. అంతే కాదు నిండు సభలో ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ చేస్తానన్నారని, ఇటీవల మంత్రులు జగదీష్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, బాల్క సుమన్‌ లు తనను భౌతికంగా అంతమోదిస్తా అని అన్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే తనకు సెక్యురిటీ కావాలని కోరానన్నారు. ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించాలని కోరారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close