FeaturedUncategorizedస్టేట్ న్యూస్

రూ.100 కోట్ల కక్కుర్తి.. బుల్లి భగవాన్‌ బురుడీలు

  • విరాళాలతో ¬టళ్ళు
  • విదేశాల్లోనూ వ్యాపారం
  • పేర్ల మార్పుల వెనుక..
  • ఈడీ పరిథిలోకి ‘కల్కీ’ కేసు

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఛస్తే ‘అర్థ ఆణా’ కూడా వెంటరాదు. ‘ఐస్‌ బాక్స్‌’ లేకుంటే ఆరు గంటలకే ఈడ్చి అవతల పడేయాల్సిందే..! ఇంట్లో ఇద్దరు ‘కృతిమ దేవుళ్ళు’. అయినా ఆశ చావలేదు. పెట్టుబడి లేని వ్యాపారంతో కోట్లు వచ్చాయి. ‘తులం’ బంగారం కొనలేని పరిస్థితి నుంచి బంగారంతో తూకాలు తూగే స్థితికి వచ్చారు. ఐటీ దాడులు జరక్కపోతే… ఈ పెదషద ‘కృత్రిమ దేవళ్ళ’కు వారసుడిగా ‘బుల్లి కల్కి భగవాన్‌’గా దర్శనమిచ్చే వాడే. ప్రజలకు మరో యాభై ఏళ్ళు గాలి మూటల వరాలతో మన మధ్యే మహా దర్పంగా నడయాడే వాడు. ఇప్పుడు ఈ ‘బుల్లి కృష్ణజీ భగవాన్‌’ వేలాది ఆస్తులు ఉన్నా… ఓ వందకోట్లకు కక్కుర్తి పడ్డాడు. దీంతో ‘కల్కి’ సామ్రాజ్య అక్రమాలు గేట్లు తెరుచుకొని వద్దన్నా వస్తున్నాయి. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న పరిశోధన కథనం.

రూ. 100 కోట్ల ‘టాక్స్‌’ కక్కుర్తి..: కల్కి ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి నేటి వరకు భూముల కొనుగోళ్లు, ఆశ్రమానికి భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల పేరిట ఆర్థిక సేకరణలు, గ్రామాల అభివృద్ధి పేరుతో చేసిన వసూళ్లు, వన్నేస్‌ ట్రస్ట్‌ వ్యవహారం, ఆశ్రమ నిర్వాహ సహచరుల వెంచర్లలో భారీ పెట్టుబడులు, ‘కల్కి’ కుమారుడు కృష్ణాజీ రెస్టారెంట్ల వ్యాపారం, విదేశీ పెట్టుబడులు… ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాటికి ఎంతోకొంత ట్యాక్స్‌ కట్టాలిగా. ఆ కొంత మొత్తం ఎంతంటే వంద కోట్ల పైమాటే.! కక్కుర్తి పడ్డాడు.

దాడులు ఎక్కడెక్కడ…?: చెన్నై గ్రీమ్స్‌ రోడ్డులోని కల్కి ఆశ్రమం, నుంగంబాక్కంలోని ప్రధాన కార్యాలయం, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ప్రధాన ఆశ్రమం, రామకుప్పం వద్ద ఉన్న ‘సత్యలోకం’ ఆశ్రమం, చెన్నైలోని అన్నానగర్‌, వేలచ్చేరి, నుంగంబాక్కం, థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లోనూ, తిరువళ్లూరు జిల్లా నేమం ఆశ్రమంలోనూ సోదాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం, బత్తులవల్లంలోని ఏకం ఆలయాల్లోనూ, ఉబ్బలమడుగు సవిూపంలోని వన్నెస్‌ ప్రాంగణం, హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌ లోని కల్కి కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు.

గుర్తించారు -40 కోట్లు స్వాధీనం: ‘వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రెస్టారెంట్లకు సంబంధించి కూడా లెక్కలు సరిగా చూపకుండా పన్ను ఎగవేశారు. వీటిలో చెన్నైలో 7 శాఖలు, మదురై, ఆంబూర్‌ బెంగళూరుల్లోనూ కొన్ని శాఖలున్నాయి. ఖతార్‌ రాజధాని దోహాలో రెండు రెస్టారెంట్లున్నాయి. వీటన్నింటిలో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన సమాచారం ఉంది” అని ఒక సీనియర్‌ అధికారి ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’కు చెప్పారు. లెక్క చూపని రూ.40 కోట్ల నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 9కోట్ల వరకు విదేశీ కరెన్సీ ఉంది. విదేశాల్లో ఏర్పాటైన ¬టళ్ళు, ఇతర లావాదేవీలపై కూపీలాగే పరిధి ఈడీ (ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌)కు వస్తుంది.

పేర్లు మార్చి… ఏమారుద్దామని..: 2008లో నిర్మించిన ‘గోల్డెన్‌ సిటీ’ ప్రారంభం.. తొక్కిసలాటలో ఐదుగురు మృతి… దీంతో కొన్ని రోజులు ఆశ్రమం మూత.. తిరిగి కార్యకలాపాలు. ఆశ్రమం చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో ‘కల్కి’ పేరు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. రామకుప్పం వద్ద ఉన్న జీవాశ్రమం ‘సత్యలోకం’గా మారింది. కల్కి ఆలయాన్ని ‘గోల్డెన్‌ సిటీ’గా ఆ తర్వాత ‘వన్నెస్‌’గా మార్చారు. ప్రస్తుతం ‘ఏకం’ పేరుతో కార్యకలాపాలు. సేవా కార్యక్రమాల కోసం ‘కల్కి రూరల్‌ డెవలప్‌ మెంట్‌’ పేరు పెట్టారు. దాన్ని ‘వన్‌ హ్యుమానిటీ కేర్‌’ పేరుగా మార్పు. ‘వన్నెస్‌’ యూనివర్సిటీ పేరిట ధ్యాన తరగతులు నిర్వహించేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ‘ఓ అండ్‌ ఓ అకాడవిూ’గా మార్చారు. ఆర్థిక లావాదేవీలన్నీ మొదట కల్కి ట్రస్ట్‌ పేరుతో జరిగేవి. అయితే కొన్ని రోజులకు ‘గోల్డెన్‌ షెల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో లావాదేవీలు జరిపారు. ఇవే ఈ ‘కృత్రిమ దేవుళ్ళ’ బురిడీలను ఒకొక్కటిగా బయటపెడుతున్నాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close