Featuredఅంతర్జాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివా

కూకట్ పల్లి : (ఆదాబ్ హైదరాబాద్ న్యూస్)నందమూరి. హరికృష్ణ  ప్రథమ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ రోడ్డు సాయి గణేష్ సెంటర్ లోని ఎన్ టి ఆర్ విగ్రహం వద్ద అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘననివాలులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి. మాంచికలపూడి భాను ప్రసాద్  మాట్లాడుతూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమం నిర్వహించిన, తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నందమూరి అభిమాని, కొడాలి రవికుమార్ మాట్లాడుతూ హరికృష్ణ, జాతికోసం జనంకోసం తపించిన భాషాభిమాని, అని రాజ్యసభలో తెలుగుభాషలో మాట్లాడి చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని సమైక్యాంధ్ర కోసం గళమెత్తిన ఆత్మాభిమానం గల అసామాన్యుడు అని అలాగే రాష్ట్ర రవాణా మంత్రిగా విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రజనేతగా ఆయన సేవలను మననం చేసుకొంటూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బుద్ధప్రసాద్, సందీప్ రెడ్డి మస్తాన్ నాగయ్య సీ హెచ్ లక్ష్మణ్ అనిల్ బ్రహ్మం టీ వేణు, కుర్తా విజయ్, రమేష్ సురేందర్ కిషోర్ ప్లంబర్ శ్రీను సుబ్బారావు, వేద మూర్తి, నాయుడు వై వి రావు, చండ్ర వెంకటేశ్వరరావు, హనుమంతరావు, రాజు, జనార్ధన్ భాస్కరరావు సాంతారం ఎడ్డూరి బ్రహ్మయ్య శ్రీధర్, రాజశేఖర్ పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close