Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

హంతకులు లేని యువ పాత్రికేయ ‘హత్య’

బంగారు తెలంగాణలో..

? ప్రభుత్వ బాధ్యత ఏది..?

? పాలకులారా నిజాలు ఏవి.?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

‘తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు. అధికారంలోకి రాగానే పరిస్థితి కాలంతో పాటు మారింది. తెలంగాణాను వ్యతిరేకించిన వారు అమాత్యులు అయ్యారు. అధికారం అనుభవించారు. కొందరు ఇంకా అనుభవిస్తున్నారు. యువతకు కొలువులపై కోటి ఆశలు కల్పించారు. వారూ బంగారు భవిష్యత్‌ కోసం కలల కోటలు కట్టుకున్నారు. అయితే ఊహలు వేరు.. వాస్తవాలు వేరు. ఊహించని నిజాలు శరాఘాతంలా కనిపించేటప్పటికి ఆ యువ హృదయం తట్టుకోలేక పోయింది. అతను ఏదో చిన్న చదువు చదువు కోలేదు. పిజీ చేశాడు. అదీ జర్నలిజంలో. రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంక్‌.

‘చావు శరణ్యం’ అంటూ చావును అనాలోచితంగా ముద్దాడాడు. ఇది యువ పాత్రికేయుడు థనకు తాను చేసుకున్న ఆత్మహత్య.. ఎంతమాత్రం కాదు. ఎవరు అవునన్నా.. కాదన్నా తప్పకుండా పాలకుల వైఫల్యమే. తమ రాజకీయ భవిష్యత్తు కోసం యువతకు భ్రమలు కల్పించిన ప్రతి వాడూ ఈ ‘హత్య’ కేసులో ప్రధాన ముద్దాయిలే. ఓ యువ పాత్రికేయుడిని, తెలంగాణ పోరాట యోధుడిని నిర్దాక్షిణ్యంగా కోల్పోయింది… కాదు దయ లేకుండా సమాజం చంపుకుంది. ఈ ఆత్మ’హత్య’తోనైనా పాలకుల్లో మార్పు వచ్చి… వేలాదిమంది జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపాలి. లేదంటే సిగ్గుతో నిస్సాహాయులుగా నిలబడండి.

ఇదీ జరిగింది:

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మ్యాదరి నవీన్‌ అనే యువకుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టాప్‌ ర్యాంకర్‌. 2013లో జర్నలిజంలో పీజీ చేశాడు. తెలంగాణ ఉద్యమంలో ఆ యువకుడు కూడా పాల్గొన్నడు. సొంత రాష్ట్రం ఏర్పడే సరికి సర్కారీ జాబ్‌ వస్తదని ఆశపడ్డాడు.. పాఠశాల నుంచే చదువులో ముందుండే అతడు ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో టాపర్గా నిలిచిండు.. పోటీ పరీక్షలకు తయారవుతూ… ఇతరులకు స్ఫూర్తి ఇచ్చిండు. కానీ, అతడి ఆశ తీరలేదు.. నోటిఫికేషన్లు లేక నిట్టూర్చిండు.. ఎన్నేండ్లు ఇట్లనే ఉద్యోగం లేకుండా ఉండాలని మదనపడ్డ ఆ యువకుడు చివరికి ఉరి కొయ్యకు వేలాడిండు. సర్కారీ కొలువు రాలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడిండు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన మ్యాదరి నవీన్‌ అనే యువకుడు ఓయూలో టాప్‌ ర్యాంకర్‌. 2013లో జర్నలిజంలో పీజీ చేశాడు. అప్పటి ఎంట్రన్స్లో నవీన్కు స్టేట్‌ 8వ ర్యాంక్‌ వచ్చింది. అప్పటి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఉంటూ పోటీ పరీక్షలకు తయారవుతూ వచ్చాడు.

అరకొరగా..:

ప్రభుత్వం వేసిన అరకొర నోటిఫికేషన్లలో ఉద్యోగం రాలేదు. మరోసారి కష్టపడదామని అనుకుంటే కొత్త నోటిఫికేషన్లు పుట్టలేదు. దీంతో.. ఇంట్లో వాళ్లు, ఊర్లో వాళ్లకు మొహం చూపించలేక తీవ్రంగా మదనపడ్డాడు నవీన్‌. ఇటీవలే స్వగ్రామం వెళ్లిన అతడు.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది ఎవరి తప్పు..:

ఉద్యమ పార్టీలో ఉన్న రాజకీయులకు పదవులు వచ్చాయి. మరి నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా ఉన్న నేతల తప్పు కాదా..? విూరు కోట్లు సంపాదించుకోండి… కానీ యవతకు గౌరవప్రథమైన చిన్న కొలువైనా చూపండి. నిరుద్యోగ భృతి నీటి మూటలైంది. ఇకనైనా నాయకులారా మారండి. యువతకు ఉపాధి చూపండి. నవీన్‌ నీకు చిన్న కొలువైని చూపలేని ఈ దౌర్భాగ్య నేతలను క్షమించగలవా…ప్లీజ్‌…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close