Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

స్వర్ణ సింధూరం

పీవీ సింధు సరికొత్త చరిత్ర..

  • ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
  • వరల్డ్‌ బ్యాడ్మింటన్‌లో ఘన విజయం

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో మెరిసింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టిన సింధు అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి స్వర్ణం గెలిచింది. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు ఘనత సాధించింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన తుదిపోరులో సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో జపాన్‌ క్రీడాకారిణి, 2017 చాంపియన్‌, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఒకుహరను చిత్తుచేసింది. ఏకపక్షంగా సాగిన తొలి గేమ్‌ను తెలుగుతేజం సింధు అలవోకగా సొంతం చేసుకుంది. అదే జోరులో రెండో గేమ్‌నూ గెలిచి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో ఒకుహరకు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. సింధు కొట్టే స్మాష్‌లకు ప్రత్యర్థి దగ్గర సమాధానమే లేకపోయింది. సెవిూఫైనల్‌ స్ట్రాటజీనే సింధు ఫైనల్లోనూ అమలు చేసి విజయం సాధించింది. క్రాస్‌ కోర్టు షాట్లతో ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి ఆ తర్వాత అలవోకగా పాయింట్లు కొల్లగొట్టింది. సెవిూఫైనల్‌ గెలుపు స్ఫూర్తితో రెచ్చిపోయి ఆడింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో తడబడి సిల్వర్‌స్టార్‌ సింధుగా నిలిచిన ఆమె నేడు ఛాంపియన్‌గా నిలిచి భారత్‌ గర్వపడేలా చేసింది. టైటిల్‌ పోరు ¬రా¬రీగా సాగుతుందనుకుంటే ఎలాంటి ఉత్కంఠ లేకుండానే ముగిసింది. టోర్నీ చివరి దశల్లో తడబడి రజతాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ, ఈసారీ నిరాశ చెందకుండా పసిడి కల నెరవేర్చుకుంది. గతంలో కన్నా భిన్నంగా నేడు సింధు జోరు సాగింది. మ్యాచ్‌ ఆద్యంతం ఆమె ఆధిపత్యం కొనసాగింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close