స్మార్ట్ విలేజి గా యాదాద్రి అభివృద్ధి

0

యాదాద్రి పట్టణాన్ని స్మార్ట్ విలేజి గా అభివృద్ధి చేయడానికి అవసరమైన పనులను 3 నెలలలోగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సి.యస్ అధ్యక్షతన యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటి సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, కిషన్ రావు, ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్, దేవాదాయ శాఖ కమీషనర్ అనీల్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, రఘుమారెడ్డి, టెంపుల్ ఈఓ గీత తదితరుల పాల్గొన్నారు.
యాదాద్రి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కేబుల్స్, స్ట్రీట్ లైట్స్, సెంట్రల్ లైటింగ్ స్ట్రాం వాటర్ డ్రైన్స్, రోడ్లు, ఫుట్ పాత్ లు, పార్కులు తదితర అభివృద్ధి పనులన్ని త్వరితగతిన చేపట్టాలని సి.యస్ ఆదేశించారు. వేద పాఠశాల నిర్మాణానికి 16 ఎకరాల దేవాదాయ భూమిని కేటాయించినందున, పాఠశాల నిర్మాణానికి సంబంధించి నివేధికను సమర్పించాల్సిందిగా సి.యస్ కోరారు, బస్వాపూర్ ట్యాంకును టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని సి.యస్ అన్నారు. రాయగిరి, గండిచెరువు, పెద్దచెరువు, మల్లాపూర్ చెరువు, సైదాపూర్ చెరువుల అభివృద్ధి పనులను సమీక్షించారు. విద్యను అభ్యసిస్తున్న స్ధపతుల సేవలు వినియోగించుకోవాలని సి.యస్ సూచించారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here