Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలు

స్పీడ్ లెజర్ గన్ తో వెయ్యి కేసులు నమోదు

జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్. 
ఆదిలాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) అతి వేగంతో వెళ్లే వాహనాలకు స్పీడ్ లెజర్ గన్ తో ఈ చలాన్ నమోదు చేస్తున్నామని, లేజర్ గన్ తొ ఇప్పటి వరకు వెయ్యి కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విష్ణు వారియర్, పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి స్పీడ్ లెజర్ గన్ కేసుల వివరాలు సేకరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో అతివేగానికి ఫోటో సాక్ష్యంతో కూడిన ఈ చలాన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
 జాతీయ రహదారులపై ఆకస్మికంగా స్పీడ్ లేజర్ గన్ ఏర్పాటుచేసి వేగానికి నిఘా పెడుతున్నామన్నారు.వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడితే ఇక నుండి తప్పించుకోలేరని అన్నారు. ఇప్పటివరకు జాతీయ రహదారి నేరడిగొండ నుండి జైనథ్ మండలం పిప్పర్ వాడ వరకు పలుచోట్ల స్పీడు లేజర్ గన్ తో వెయ్యి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు, ప్రతి ఈ చలాన్ కు 1035 రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు అయిన వెంటనే సదరు వాహనం ఒక కిలో మీటర్ లో ఉన్న సమయంలోనే వాహన యజమాని సెల్ ఫోన్ కు మెసేజ్ వస్తుందని తెలిపారు. జాతీయ రహదారిపై ఈ చలాన్  కేసులు నమోదు కావడంతో వాహనా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటారని తెలిపారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటుందని తెలిపారు. స్పీడ్ లేజర్ గన్ వినియోగించడానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక నిపుణుల బృందాన్ని నియమించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా స్పీడ్ లేజర్ గన్ వినియోగించి ఈ చలాన్లు నమోదు చేస్తామని తెలిపారు. జాతీయ రహదారిపై తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close