సెక్రటేరియేట్‌ వీడియో కాన్ఫనెన్స్‌లో నీలిచిత్రం

0

రాజస్థాన్‌ సెక్రటేరియేట్‌లో విస్తుపోయే సంఘటన జరిగింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫనెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తెరపై నీలిచిత్రం దర్శనమిచ్చింది. దీంతో అధికారులంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోవాల్సి వచ్చింది. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌ ఆహార, పౌర సరఫరాల కార్యదర్శి ముగ్ధాసింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె అధ్యక్షతన ఎన్‌ఐసీ రూంలో సోమవారం పౌరసరఫరాల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 10 మంది ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా.. తెరపై ఒక్కసారిగా ఓ నీలిచిత్రం ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా అందరూ తెల్లమొహాలు వేశారు. ఈ ఘటనపై ముగ్ధాసింగ్‌ స్పందించారు. దీనికి కారణమైన అధికారి తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here