సల్మాన్‌ ఖాన్‌

0

ఇండియాలో చాలామంది ఎలిజిబుల్‌ బ్యాచిలర్లే ఉన్నారు కానీ వారందరిలో సీనియర్‌ మోస్ట్‌ ట్యాగ్‌ మాత్రం బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ కే. ఈ కండల వీరుడి ప్రేమాయణాలు రాసుకుంటూ పోతే అవి నెవర్‌ ఎండింగ్‌. అయితే ఎన్ని ప్రేమాయణాలు ఉన్నా అవి మాత్రం పెళ్ళి వరకూ వెళ్ళలేదు. ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి అని బాలీవుడ్లో గాసిప్పులు వినిపిస్తూ ఉంటాయి కానీ అయన పెళ్ళిచేసుకోడు. ఒకింటి ఆయన కాడు! పెళ్ళి గిళ్ళీ దేవుడెరుగు.. ఇప్పుడు భాయిజాన్‌ కు తండ్రికావాలనే ఆలోచన వచ్చిందట. ఇప్పటికే బాలీవుడ్‌లో సరోగసీ విధానం(అద్దెగర్భం) ద్వారా చాలామంది సెలబ్రిటీలు పిల్లలను కన్నారు. అలాంటివారిలో షారుఖ్‌ – గౌరీ దంపతులు కూడా ఉన్నారు. అయితే వారు పెళ్ళైన జంట. అలా కాకుండా సరోగసీ విధానంలో సింగిల్‌ పేరెంట్‌ అయిన వారు కూడా ఉన్నారు. కరణ్‌ జోహార్‌.. ఏక్తా కపూర్‌ లాంటి వారు అలాంటి విధానంలోనే సింగిల్‌ పేరెంట్‌ గా మారి పెళ్ళి లేకుండానే పిల్లలను కన్నారు. ఇప్పుడు సల్మాన్‌ కూడా అదే విధానంలో తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడట. సల్మాన్‌ కు పిల్లలంటే చాలా ఇష్టం.. అయితే పెళ్ళి చేసుకునే ఆలోచన మాత్రం లేదట. అందుకే ఇలా ఒక బిడ్డను కంటే తన జీవితంలోకి కొత్త సంతోషం వస్తుందని ఆలోచనతో ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో చర్చించాడట. వైద్యులతో కూడా డిస్కషన్స్‌ జరిగాయని బాలీవుడ్‌ లో కథనాలు వెలువడుతున్నాయి. సో.. త్వరలోనే జూనియర్‌ సల్మాన్‌ ఎంట్రీ ఉంటుందన్న మాట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here