సినిమా వార్తలు

సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డు చెంపచెళ్లు

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన బాడీగార్డు చెంపచెళ్లుమనిపించారు. తన ఫ్యాన్‌ అయిన ఓ బాలుడితో దురుసుగా ప్రవర్తించడం పట్ల సల్లూభాయ్‌ బాడీగార్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ చుట్టూ ఉండగానే అతడిని కొట్టారు. మంగళవారం రాత్రి ముంబయిలో ‘భారత్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ సల్మాన్‌ను చూసేందుకు అభిమానులు గుడికూడారు. షో పూర్తవగానే బయటికి వచ్చిన సల్మాన్‌ అందరికీ అభివాదం చేసుకుంటూ కారు ఎక్కబోయారు. ఈ క్రమంలో ఆయన బాడీగార్డు సల్మాన్‌ను దారి ఏర్పరిచే క్రమంలో ఓ బాలుడ్ని పక్కకు నెట్టారు. కనీసం అతడ్ని పైకి కూడా లేపలేదు. దీంతో ఆగ్రహించిన సల్లూభాయ్‌ అతడి చెంపచెళ్లుమనిపించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close