సచివాలయం కూల్చివేతపై హైకోర్టు విచారణ

0

సచివాలయాన్ని కూల్చి వేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు

సచివాలయాన్ని కూల్చి వేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని నిర్ణయించినప్పుడు 2016లో హైకోర్టులో జీవన్‌రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం సచివాలయం కూల్చివేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుత సచివాలయం భవనాన్ని కూల్చబోమని సర్కారు తరఫున అప్పటి అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన మాట మార్చిందని, సచివాలయం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని తాజాగా సోమవారం జీవన్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here