Uncategorizedఇతర వార్తలుక్రైమ్ న్యూస్

షుగర్ ఉందని… నరకం చూపించారు… సంగారెడ్డిలోని బాలాజీ ఆసుపత్రి

షుగర్ ఉందని… నరకం చూపించారు. ప్రాణాపాయ స్థితిలో కమలమ్మ.రెండు రోజులపాటు ఐసీయూ కు తరలింపు50 వేల బిల్లు బాదిన శ్రీ బాలాజీ ఆసుపత్రివికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్. కొండనాలుకకు మందు పెడితే…. ఉన్న నాలుక ఊడి పోయినట్లు… చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే డాక్టర్లు నరకం చూపించారు పరిస్థితి విషమం చేశారు. చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు చావలేక బతకలేక కొట్టుమిట్టాడుతున్న అభాగ్యురాలి ఉదంతమిది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంతయ్య పల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.. అనంతయ్య పల్లి గ్రామానికి చెందిన నేత దానయ్య కమలమ్మ దంపతులు గొంతు నొప్పితో బాధపడితే చికిత్స కోసం సంగారెడ్డిలోని శ్రీ బాలాజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్లు నేత కమలమ్మను పరీక్షించి షుగర్ ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చారు. క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం మందులు వాడాలని పంపించారు . కానీ నీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అసలు  నేత కమలమ్మకు షుగర్ లేదు షుగర్ లేకపోయినా ఎక్కువ మోతాదు షుగర్ మాత్రలు రాసి ఇవ్వడంతో అవి మింగి నేత కమలమ్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. కాళ్లు చేతులు పని చేయక ఇంట్లోనే కొట్టుమిట్టాడింది పరిస్థితి విషమించడంతో తిరిగి సంగారెడ్డిలోని శ్రీ బాలాజీ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో రెండు రోజులపాటు ఉ ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు రెండు రోజులపాటు చికిత్స అనంతరం ఆమె తిరిగి కోలుకుంది. ఆమెకు ఈ పరిస్థితి రావడానికి కారణం తెలుసుకోవడానికి డాక్టర్లు రకరకాల పరీక్షలు నిర్వహించారు వారి పరీక్షల్లో నేత కమలమ్మకు షుగర్ లేనట్లు తేలింది ఈ విషయం తెలుసుకున్న శ్రీ బాలాజీ ఆసుపత్రి డాక్టర్లు ఖంగుతిని గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రిలోని చికిత్స అందిస్తున్నారు. దాదాపు 50 వేల రూపాయలు నేత కమలమ్మ చికిత్స కోసం భర్త నేత దానయ్య ఖర్చు చేయవలసిన పరిస్థితి నెలకొంది మామూలు జ్వరం వచ్చిన వివిధ రకాల పరీక్షల పేర ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వేలాది రూపాయలు ఫీజుగా వసూలు చేస్తుంది. కానీ వారి తప్పిదం వల్లనే లేని రోగాన్ని అంటగట్టి చికిత్స కోసం 50 వేల రూపాయలు వసూలు చేశారు. ఇంత భారీ మొత్తాన్ని ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించలేక నేత దానయ్య నానా అవస్థలు పడవలసివచ్చింది. తెలిసిన వారి దగ్గర అప్పు చేసి భార్య నేత కమలమ్మకు చికిత్స అందించారు .సకాలంలో తన భార్యను ఆసుపత్రికి తీసుకురాకపోతే కోమాలోకి వెళ్లి చనిపోయే పరిస్థితి నెలకొందని నేత దానయ్య ఆదాబ్ తెలియజేస్తారు తప్పు ఒక్కడు చేస్తే శిక్ష తాము అనుభవించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా లేని షుగర్ వ్యాధికి చికిత్స అందించి కమలమ్మ ఒళ్ళు గుల్ల చేశారని కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వారం రోజుల కోసం డాక్టర్లు మందులు రాశారని వాటిని కొనుగోలు చేయడానికి తన దగ్గర డబ్బులు లేవని అన్నారు   ప్రస్తుతం నేత కమలమ్మ బిపి షుగర్ పల్స్ పూర్తిగా పడిపోయి సరిగా కూర్చోవాలని లేవలేని స్థితిలో ఉంది. కొనుక్కోవడానికి చాలా సమయం పట్టవచ్చునని ఆమె భర్త దానయ్య తెలియజేసారు .చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన శ్రీ బాలాజీ ఆసుపత్రి యాజమాన్యం పై చర్య తీసుకోవాలని ఆయన కోరారు .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close