షీలాదీక్షిత్‌కు కన్నీటివీడ్కోలు

0

ముగిసిన షీలాదీక్షిత్‌ దహనక్రియలు

గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు ముగిశాయి. షీలా దీక్షిత్‌ భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో ఆమె పార్ధివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దివంగత నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అంతిమ యాత్రకు తరలివచ్చారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రియంకాగాంధీ వాద్రాలతో పాటు కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా, దిల్లీ ¬ంమంత్రి సత్యేందర్‌జైన్‌లు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు సోనియాగాంధీ, షీలాదీక్షిత్‌ మృతదేహానికి నివాళులు అర్పిస్తూ.. షీలా తనను ఒక సోదరిలా చూసుకునేదని, ఆమె మరణించడం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. భాజపా అగ్రనాయకులు ఎల్‌.కే అడ్వాణీతో పాటు మాజీ విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా షీలా మృతదేహానికి అంతిమ నివాళులు అర్పించారు. అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఆశోక్‌గ¬్లత్‌, కమల్‌నాథ్‌.. తదితరులు ఆమె మృతదేహాన్ని దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. శనివారంనాడు దేశ ప్రధాని నరేంద్రమోదీ, దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌తివారి ఆమె మృతదేహానికి అంతిమ నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here