శ్రీపీఠం నుంచి రాజకీయమఠానికి..

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బీజేపీ జాతీయ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని బరిలోకి దింపనుంది. అందులో భాగంగానే పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరినట్లు సమాచారం. గత కొంతకాలంగా పరిపూర్ణానంద బీజేపీతో సత్సమ సంబంధాలు నెరపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈనెల 8న అమిత్‌ షా తో సమావేశమైన పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరికపై చర్చించారు. ఈనెల 19న బీజేపీలో చేరనున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లుగానే శుక్రవారం అమిత్‌ షా సమక్షంలో పరిపూర్ణానంద స్వామి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు రాంమాధవ్‌, అమిత్‌ షా పరిపూర్ణానంద స్వామితో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలు, తెలంగాణలో పరిపూర్ణానంద స్వామి పోటీపై చర్చించారు. ఆంధ్రా ఓటర్లు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం నుంచి పరిపూర్ణానంద స్వామి పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను ఏమీ ఆశించకుండా పార్టీలో చేరానని బీజేపీ సిద్ధాంతాలను నలుమూలల వ్యాపింప చెయ్యడమే తన లక్ష్యమని చెప్పారు. బీజేపీ కోసం 24 గంటలు పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎంత త్రికరణశుద్ధిగా పనిచేశానో బీజేపీ కోసం అంతే స్థాయిలో పని చేస్తానన్నారు. తనకు ముందు, వెనకా ఎవరూ లేరని తానొక సాధువునని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అమిత్‌ షా నేత త్వంలో మార్గదర్శకత్వంలో 24 గంటలు పని చేస్తానని వాగ్దానం చేశారు. తెలుగు ప్రజలు తనకు ఎంతో ఇచ్చారన్నారు. బీజేపీ కుటుంబంలో తాను కూడా భాగమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ పని చేస్తోందని పరిపూర్ణానంద అన్నారు. సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరానని పరిపూర్ణానంద తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, రాం మాధవ్‌ నేతత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.

ఉదయం ఏం జరిగింది?…శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. స్వామికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని పరిపూర్ణానందకు అందజేశారు. మోదీ, అమిత్‌ షాతో కలిసి పనిచేసేందుకే బీజేపీలో చేరానన్నారు స్వామి. పార్టీ అధ్యక్షుడి మార్గదర్శనంలో.. బీజేపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కషి చేస్తానన్నారు. స్వామి పరిపూర్ణనంద బీజేపీలో చేరడం శుభపరిణామం అన్న అమిత్‌ షా.. పార్టీకి ఆయన సేవల్ని ఉపయోగించుకుంటామన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న పరిపూర్ణానంద స్వామి.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో సమావేశమై.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తర్వాత షా సమక్షంలో బీజేపీలో చేరారు. పరిపూర్ణానందకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కూడా ఆయన బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here