Featuredఅంతర్జాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

శాంతియుతంతో పనులను సాధించవచ్చు

జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్  
ఆదిలాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) నిజాయితీ, శాంతియుతంతో పనులను సాధించుకోవచ్చని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. జిల్లాలోని మల్లాపూర్, ధర్మసాగర్ గ్రామాలను సిరికొండ మండలం నుండి ఇంద్రవల్లి మండలంలోకి మార్చినందుకు శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులకు మల్లాపూర్ గ్రామస్తులు  సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి వారికి పుష్పగుచ్చాన్ని అందించి, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తుల నిజాయితీ, ఐక్యత, ప్రజాప్రతినిధుల తోడ్పాటు, అధికారుల సహకారంతో సాధించారని అన్నారు. ఆదివాసులకు కోపం ఎక్కువగా ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గుర్తుచేశారు. ఆదివాసుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంత గిరిజనుల దూరభారాన్ని గుర్తించిన  సమస్యలను పరిష్కరించారని అన్నారు. తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించానని, గ్రామస్తులు అందరూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఇదే తనకు ఇచ్చే బహుమతి అని, గిరిజనులు ఇప్పపువ్వు మొక్కలను నాటించి, ఇప్పపువ్వు చెట్లను పెంచాలని, తమ పిల్లల్ని పాఠశాలకు పంపించాలని అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా పారిశుద్ధ్య కార్యక్రమాలను, మొక్కల పెంపకానీ లో భాగస్వాములు కావాలని అన్నారు. తడి, పొడి చెత్తను విడివిడిగా బుట్టల్లో వేసి డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. వర్షాకాలంలో త్రాగునీటిని వేడి చేసి వడపోసి తాగాలని తెలిపారు. గ్రామానికి వచ్చే రహదారికి ఇరువైపులా పూల మొక్కలను పెంచాలని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ గ్రామాలను ఇంద్రవెల్లి మండలంలో కలపడంతో అధికారుల కృషి మరువలేనిదని, అందరూ ఒకే కుటుంబం లాగా కలిసి పనిచేసి సాధించుకున్నామని అన్నారు. అలాగే గ్రామాలకు అవసరమయ్యే రోడ్లు, వంతెనలు, నీటి సమస్యలు అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామాలను ఒక మండలం నుండి మరో మండలంలోకి మార్చడం రాష్ట్రంలోనే మొదటిదని అన్నారు. జిల్లాలోని  గిరిజన యువతకు పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ ఇవ్వడం జరిగిందని, 580 మంది నిరుద్యోగులకు జాబ్ మేళాలో ఉద్యోగం కల్పించడం జరిగిందని, త్వరలో మరో 500 మందికి జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు .చదువు వల్ల కలిగే లాభాలపై ఎస్పీ వివరిస్తూ పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని అన్నారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామం ముందు కలెక్టర్, ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్, డీఎస్పీ డేవిడ్, జడ్పిటిసి పుష్పలత, ఎంపీపీ శోభా బాయి, సర్పంచ్ మడావి బాపురావు, డిఆర్డివో రాజేశ్వర్ రాథోడ్ ఐటిడిఎ సలహా మండలి మాజీ చైర్మన్ భీమ్ రావు, ఏపీవో జనరల్ భీమ్ రావు, పీసా కోర్డినేటర్ వెడ్మ బొజ్జు, ఎంపిడీవో రమాకాంత్, తహశీల్దార్ సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close