వీళ్లా మన నాయకులు

0

– అప్పుడు సంపాదించారు..ఇప్పుడు పంచుతున్నారు

– ఒకరు ఇన్నోవాలు.. మరొకరు టివిఎస్‌ వాహనాలు

– ఇన్ని కోట్లు ఎక్కడివని విస్తుపోతున్న ఓటర్లు

ఇన్నోవా కొనాలంటే ఇరవై లక్షలకు పైగా అవుతుంది. టివిఎస్‌ వావానం ఇంచుమించు ఎనభై వేలవుతుంది.. కాయకష్టం చేసి సామాన్యుడికి ఈ వాహనాలు కొనడం ఒక కల ఐతే, తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికలో నాయకులు గెలవాలని, ఆరునూరైనా మళ్లీ అధికారం రావాలని ఇన్ని రోజులు అక్రమంగా సంపాదించినా కోట్ల రూపాయలను బయటకు తీస్తున్నారు. ఖర్చులకు వెనుకాడకుండా తాయిలాల మీద తాయిలాలు ప్రకటిస్తున్నారు.. ఒకరెమో అనుచరులకు ఇన్నోవా వాహానాలు ఇస్తే, మరొకరెమో మోటార్‌ వాహనాలు ఇస్తున్నారు.. చాటుమాటుగా సాగే ప్రచారంలో కుంకుమ భరిణెలతో పాటు ఓటర్లను ఆట్టుకునే అవకాశం ఉన్న అన్ని దారులను వెతుకుతున్నారు మన బరిలో ఉన్న అధికార పార్టీ నాయకులు… అధికారంలో ఉన్నప్పుడు కోట్లు సంపాదించిన వారు మళ్లీ అధికారం చేజారిపోవద్దంటూ ఆట్టుకునే పనిలో పడ్డారు…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): చిత్రాలు… విచిత్రాలు అన్ని మన ముందస్తు ఎన్నికల్లో జరిగిపోతున్నాయి.. గెలుపు యావలో పడ్డ అభ్యర్థులు వెనకాముందు ఆలోచించకుండా ప్రచార బరిలో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు… ఏలాగైనా గెలుపు సాధించాలంటూ ఎవరికి తోచిన రీతిలో వారు సన్నిహితులకు, అనుచరులకు తాయిలాల మీద తాయిలాలు ఇచ్చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా కాని భయపడేదీ లేదంటూ లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను బహుమతులుగా ఇచ్చేస్తున్నారు… పదిహేను రోజుల్లో సమయం ఉన్న ఎన్నికల్లో నాయకుల ప్రచారంలో ఎన్నెన్నో అంతుచిక్కని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి… ఓటర్లను ఆకట్టుకోవాలి, గెలుపును సులువుగా కైవసం చేసుకోవాలి. ఇప్పుడు పోతే పోని కోట్ల రూపాయలు, అధికారం వచ్చాక వందల, వేల కోట్లు సంపాదించుకోవచ్చని ఆలోచనలో ఉన్న నాయకులు లక్షలు విలువ చేసే వాహనాలు, వస్తువులు పంచడంపై ప్రజల్లో విభిన్న రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు సమస్యలపై స్పందించని నాయకులు ఇప్పుడు మాత్రం ఇన్ని కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులను ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నంలో ఇన్నోవా వాహానాలు పంపిణీ

హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన కోసం, తన గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారంటూ తన ముఖ్య అనుచరులకు లక్షల రూపాయలు విలువచేసే ఇరవై ఇన్నోవా వాహనాలను కానుకగా ఇస్తున్నాడని నియోజకవర్గంలో సమచారమంతా చర్చనీయాంశమయింది. ఎన్నిలు జరుగుతున్నాయి ఎలక్షన్‌ నిఘా ఉంటుంది కావున దశల వారీగా వాహానాలు తీసుకొని నా గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడాలని అనుచరులకు సూచించినట్లు సమాచారం. అందులో భాగంగా మొదటి దశలో మూడు కొత్త ఇన్నోవా వాహనాలను ముగ్గురు అనుచరులకు అందించడం జరిగింది. విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది గుర్తుకురాని మాజీ శాసనసభ్యుడిగా ఇన్ని లక్షల విలువ చేసే ఇన్నోవాలు ఇస్తున్నారంటే, ఇంకా ముందు ముందు ఎన్నికల్లో ఎన్ని కోట్లు రూపాయలు ఖర్చు పెడుతారో అని చర్చించుకుంటున్నట్లు సమాచారం. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కొనుగోలు చేసి పంపిణి చేసిన ఇన్నోవా వాహానాలపై ఎలక్షన్‌ కమిషన్‌ నిఘా వేసి సమాచారం సేకరించి పనిలో ఉన్నారు.

దేవరకద్రలో టివిఎస్‌ వాహానాలు… ఎన్నికల్లో గెలిస్తే ప్రజల అభివృద్దికోసం పాటుబడి, ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పే నాయకులు ఉంటారు కాని అక్రమంగా గెలుసు సాధించి అందుకు పదింతలు సంపాదించే నాయకులు నేడు ఇంచుమించుగా అన్ని నియోజకవర్గాల్లో కనబడుతున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా దేవరకద్ర తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యెగా బరిలో ఉన్న వెంకటేశ్వరరెడ్డి ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఏకండా 1500 టివిఎస్‌ వాహానాలను పంపిణీ చేసేందుకే రంగం సిద్దం చేశారు. టివిఎస్‌ తీసుకోండి, మాకు ఓటు వెయ్యండి అంటూ ప్రచారం చేస్తూ చాటుమాటుగా వాహానాలు పంపిణీ చేస్తుండగా ప్రతిపక్షం నాయకులు పట్టుకొని స్థానిక ఎలక్షన్‌ అధికారులకు అప్పజెప్పారని నిబంధనల ప్రకారం అభ్యర్థులపై చర్యలు ఉంటయని అధికారులు తెలిపినట్లు ప్రతిపక్షనాయకులు అంటున్నారు. కోట్ల రూపాయల విలువైన టివిఎస్‌ పదిహేను వందల టివిఎస్‌ వాహానాలు పంచడంపై ప్రతిపక్షనాయకులు సైతం నోరెళ్ల పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల సంపాదించి, మళ్లీ అధికారం కోసం ఎంతకైనా తెగించేందుకు తెరాస నాయకులు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది.

ఆఫిడవిట్‌పై సంతకం మరిచిన అభ్యర్ధి.. జనగాం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాను వేసిన నామినేషన్‌ పత్రాలలో ఆఫిడవిట్‌పై సంతకం పెట్టకుండానే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా దాఖలు చేశారు. తీసుకునే ముందు అధికారులు చూడలేదో, ఇచ్చే ముందో అభ్యర్థి సరిచూసుకోలేదో తెలియదు కాని మన నాయకుల పనితీరు, హడావుడీ ఏలా ఉందో ఈ విషయాలను బట్టే తెలుస్తోంది. వీరు మన రాష్ట్రాన్ని, మనలు పాలిస్తామంటూ క్యూడుతున్నారు. ప్రజలకు సేవచే యడానికి వచ్చామం టూ చెపుతూ పరువు తీస్తున్నారంటూ ఓటర్లు నియోజకవర్గాల్లో చర్చించుకుంటున్నారు. అవగాహన లేని నాయకులు కొంత మంది ఐతే, డబ్బుకు లెక్కచేయకుండా ఎన్ని కోట్లు ఖర్చుపెట్టైనా గెలవాలని తాపత్రయ పడే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటివరకు ఓటర్లను తాయిలాలు, అను చరులకు బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలిచినవారందరూ అధికారపార్టీకి చెందిన నాయకలు కావడం గమనార్హం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here