Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

వీరవనిత ఝాన్సీ లక్ష్మీ భాయ్‌?

తెలియని సత్యాలు ఎన్నో

? సాధారణ మహిళకు అసాధారణ కష్టాలు

? మరణ రహస్యాలు

? హిస్టరీలో మిస్టరీ కథనం-4 ?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌, 9440000009)

అందరికీ తెలిసిన ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ ఓ వీర వనిత. కానీ ఆమె జీవితంలో బాహ్య ప్రపంచానికి తెలియని విభిన్న కోణాలు. చిన్నపుడే తల్లి చనిపోయింది. తండ్రి పెంచాల్సిన పరిస్థితి. అతి చిన్న వయసులోనే పెళ్లి. అంతలోనే విషాదం. పుట్టిన కొడుకు చనిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక భర్త మరణం. ఇలా అడుగడుగునా సామాన్య స్త్రీలు పడే కష్టాలు. మరో కోణంలో దత్తత కొడుకును వీపున కట్టి, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో గుర్రపు కళ్లెం పట్టుకొని యుద్ధంలోకి దిగింది. కన్న తల్లిలాంటి తన రాజ్యాన్ని, రాజ్య ప్రజలను రక్షించాలని బ్రిటిష్‌ వారితో వీర పోరాటం చేసింది.

స్ఫూర్తి:

భారతీయులకు ఆమె స్ఫూర్తి దాయకం. ధైర్యం, పరాక్రమం, వివేకం ఇలా ఆమె గూర్చి చెప్పాలంటే మాటలు సరిపోవు. భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా మహిళా సైన్యాన్ని తయారు చేసిన గొప్ప వనిత. స్వతంత్ర పోరాటంలో పోరాడిన మొట్టమొదటి వీరవనిత. ఆమె చేసిన త్యాగాలు ఎప్పటికి మరువనివి. కానీ చివరకు వీర మరణం పొందింది. ఆమె మరణంఫై ఎన్నో అనుమానులు ఉన్నాయి. బ్రిటిష్‌ వారి తూటాలకు బలి అయ్యిందా? లేక తనకు తానే ఆత్మ హత్య చేసుకుందా? గ్వాలియర్‌ యుద్ధంలో దొరికిన శవము ఆమెది కాదు అని బహిరంగ ప్రకటనే జరిగింది. .. ఆమె మరణం వెనుక ఉన్న అసలు కథ ఏంటి?

మణికర్ణిక:

ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. మహారాష్ట్రకు చెందిన సతారలో 1828, నవంబరు 19న జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్‌ తాంబే, భాగీరథీబాయిలు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. కానీ ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నపుడే కన్ను మూయడంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి విూద పడింది.

బాజీరావు సహాయం:

ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరో పంత్‌, ఝాన్సీ లక్ష్మీబాయి బిఠూర్‌ కు పిలిపించి ఆశ్రయమిచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్‌ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్‌ యొక్క పినతండ్రి కుమారుడు రావు సాహెబ్‌ వీరిద్దరూ లక్ష్మీబాయిని తమ చెల్లెలిగా చూసుకునేవారు. వీరుముగ్గురూ కలిసే కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలన్నీ నేర్చుకున్నారు. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్‌ వెంట మనూబాయి కూడా దుసుకొని పోయేది.

ఝాన్సీ పెళ్లి:

1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్‌ తో లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే వివాహమైంది. దీంతో అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి పిలిచారు. లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్ను మూయడంతో లక్ష్మీబాయి, గంగాధరరావులు దామోదర్‌ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకొన్నారు. కన్న కుమారుడి మరణం నుంచి తేరుకోలేక బాధ పడుతూ ఆ తర్వాత గంగాధర్‌ చనిపోయాడు.

లండన్‌ కోర్టుకు:

హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్‌ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా, దామోదర్‌ రావు, గంగాధర్‌ రావుకు రక్త సంబంధం కానందున సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని బ్రిటీష్‌ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. రాణి దీనికి ఒప్పుకోలేక లండన్‌ కోర్టులో దావా వేసింది. కానీ కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులు రాణి విూద కక్ష పెంచుకొని గంగాధర్‌ రావు తీసుకున్న అప్పుకు వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె వెంటనే ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.

ఇలా మొదలైన పోరాటం:

రాణి ఝాన్సీ పట్టణాన్ని బ్రిటిష్‌ వారికీ ఇవ్వకూడదని పోరాటానికి సిద్దపడింది. 1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మలిచింది .లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమకూర్చి సైన్యాన్ని బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇచ్చింది .

దాడి ఇలా మొదలెట్టింది:

1858లో బ్రిటిష్‌ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్‌ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. రెండు వారాల పోరాటం తర్వాత లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో బ్రిటిష్‌ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది.

‘తాంతియా తోపే’తో కలసి..:

ఆ తర్వాత కల్పి అనే ప్రదేశానికి చేరుకుని విప్లవకారుడు తాంతియా తోపేతో చేయి కలిపి మరింత బలగాన్ని పెంచుకుంది. రాణి, తాత్యా తోపే గ్వాలియర్‌ కు వెళ్లి తమ తిరుగుబాటు చేసి గ్వాలియర్‌ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసింది. కానీ బ్రిటిష్‌ వారు తరువాత మళ్ళీ కపట ఉపాయంతో గ్వాలియర్‌ కోటను ఆక్రమించుకొన్నారు. 1858,జూన్‌ 17న రెండవరోజు యుద్ధంలో రాణి మరణించింది.

నేపాల్‌ లో మరణించిందా..?:

ఈమె యుద్ధంలో మరణించలేదని, ఝాన్సీ కోట నుండి తప్పించుకున్నాక ప్రతాప్‌ గడ్‌ రాజు ఆశ్రయమిచ్చారు. అనంతరం అక్కడి నుండి నేపాల్‌ కి వెళ్లే ఏర్పాట్లు చేసాడు. 1915లో సహజ సిద్ధంగా మరణించిందని మరో వాదన ఉంది.

ఝాన్సీ కాదు ఝుల్కారీబాయ్‌:

యుద్ధ సమయంలో బ్రిటిష్‌ బుల్లెట్స్‌ కి అందరికీ తెలిసి ఝాన్సీ లక్ష్మీ బాయ్‌ మరణించించింది. కానీ అచ్చం ఝాన్సీలక్ష్మి భాయ్‌ ల ఉండే ఝల్కారిబాయి మరణించిందనే వాదన ఉంది. ఝాన్సీలక్ష్మి భాయ్‌ మహిళా సైన్యంలో ఉండే గొప్పవనిత ఝల్కారిబాయి అని విఎల్‌.వర్మ ”ఝాన్సీ రాణి” అనే పుస్తకంలో చెప్పారు.

చివరగా…

ఆమె పోరాటానికి గుర్తుగా వీరవనిత ఝాన్సీలక్ష్మి భాయ్‌ గుర్రం పైన కూర్చున్నట్లుండె కంచు విగ్రహాలు ఝాన్సీ, గ్వాలియర్‌ లో ఏర్పాటు చేసారు. కానీ ఆమె మరణ రహస్యంపై ఉన్న మిస్టరీని ఎవరూ ఛేదించలేదు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close