Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

విస్తరణ వాయిదా..!

రేగాకు పిలుపు..

మజ్లీస్‌కు పిఎసి చైర్మన్‌ పదవి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారం ముదురుతున్న కారణంగా ఆయన మంత్రివర్గ విస్తరణ ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. విస్తరణలో జాప్యం జరిగే అవకాశం ఉండడంతో కేసీఆర్‌ శాసనసభ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శనివారం పిలువు వచ్చింది. దాంతో ఆయన హుటాహుటిన హైదరాబదు బయలుదేరారు. ప్రభుత్వ విప్‌ గా నియమించి ఆయనకు క్యాబినెట్‌ ¬దా కల్పించనున్నట్లు సమాచారం. శాసనసభ, శాసన మండలి చీఫ్‌ విప్‌, విప్‌ పదవుల భర్తీకి కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత శాసనసభ సమావేశాలు ముగిసే లోగా కమిటీల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌ ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పిఎసి)లో 13 మంది సభ్యులుంటారు. వారిలో తొమ్మిది మంది శాసనసభ నుంచి, నలుగురు శాసన మండలి నుంచి ఎంపికవుతారు. పిఎసి చైర్మన్‌ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం సంప్రదాంయ. 119 మంది శాసనసభ్యులున్న సభలో అధికార టిఆర్‌ఎస్‌ కు 103 మంది సభ్యులున్నారు. కాంగ్రెసు తరఫున 19 మంది ఎన్నిక కాగా, 12 మంది టీఆర్‌ఎస్‌ లో చేరారు. దీంతో కాంగ్రెసు ప్రధాన ప్రతిపక్షం ¬దాను కోల్పోయింది. దాంతో ఏడుగురు సభ్యులున్న మజ్లీస్‌ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అధికారికంగా దానికి ప్రతిపక్ష ¬దా దక్కదు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పిఎసి చైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉంది.

ప్రభుత్వ విప్‌లను నియమించిన ప్రభుత్వం.

ఈ నెల తొమ్మిది నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లను శనివారం సాయంత్రం ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా దాస్యం వినయ్‌ భాస్కర్‌, విప్‌లుగా గొంగిడి సునిత, గంప గోవర్థన్‌, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగ కాంతారావు, బాల్క సుమన్‌లను నియమించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close