Featuredజాతీయ వార్తలు

లోక్‌ సభ ఓకె ..! రాజ్యసభతోనే చిక్కు .. !

  • విభేదాలు పక్కనపెట్టి ముందుకు సాగుదాం
  • పార్లమెంట్‌ లో టీమ్‌ స్పిరిట్‌
  • అఖిలపక్ష భేటీలో ప్రధాని పిలుపు

పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు విభేదాలను పక్కనపెట్టాలని వివిధ రాజకీయ పార్టీల నేతలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సోమవారం నుంచి 17వ లోక్‌ సభ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా పార్లమెంట్‌ లైబ్రరీ భవన్‌లో మోదీ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల భేటీ ఆదివారం జరిగింది. ప్రధాని మోడీతో పాటుగా, రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌,పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సహా పలువురు కేంద్రమంత్రులు హాజరైన ఈ విూటింగ్‌ కు టీఆర్‌ఎస్‌ నుంచి కేశవరావు, నామ నాగేశ్వరరావు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, టీడీపీ నుంచి గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు హాజరయ్యారు. పార్లమెంట్‌ సమావేశాలపై ఈ సందర్భంగా చర్చించారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత జరుగుతున్న తొలి అఖిలపక్ష సమావేశం ఇదే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ”మనం ఇక్కడ ప్రజల కోసం ఉన్నాం. పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగించడం ద్వారా ప్రజల మన్ననలను పొందలేం. అందుకే విభేదాలను పక్కనపెట్టి జాతి ప్రగతికి ముందుకు సాగుదాం” అని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామా లేదా అనే విషయాన్ని ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీలకు మోదీ సూచించారు. 2022 నాటికి నవభారత నిర్మాణాన్ని సాధించే దిశగా సభ్యులు తమ సలహాలు, సూచనలు అందజేయాలని అన్నారు. రాజకీయ పార్టీలు లేవనెత్తే ప్రతి పార్టీ అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌తో పాటు పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే తీసుకురానున్నారు. జులై 4న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. 5న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల నుంచి అదే విధంగా భాగస్వామ్య పార్టీల నుంచి తమకు కొన్ని సూచనలు వచ్చాయని ఈ సారి పార్లమెంట్‌ కొత్తవాళ్లు ఎన్నిక అయ్యారని,కొత్తవాళ్లతో పాటు కొత్త ఆలోచనలు కూడా పార్లమెంట్‌ కు రావాలని ప్రధాని మోడీ అన్నారన్నారు.జూన్‌-19న పార్లమెంట్‌ లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మోడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఒకే దేశం ఒకే ఎన్నిక,మహాత్మా గాంధీ 150వ జయంతి వంటి పలు ముఖ్యమైన అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లు జోషి తెలిపారు. పార్లమెంట్‌ లో టీమ్‌ స్పిరిట్‌ ను పెంపొందించాలని మోడీ అనుకుంటున్నారని జోషి తెలిపారు.అందుకోసం జూన్‌-20,2019 మొత్తం లోక్‌ సభ,రాజ్యసభ ఎంపీలను విూటింగ్‌ కు ఆహ్వానించారని జోషి తెలిపారు. నేటి నుంచి 26 తేది వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.

లోక్‌ సభ ఓకె ..! రాజ్యసభతోనే చిక్కు .. !

రాజ్యసభలో ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి అన్ని పార్టీలు? ముఖ్యంగా విపక్షాల మద్దతు అవసరం. ఈ సభలో ప్రభుత్వం ఇంకా మైనారిటీలోనే ఉంది. 545 సీట్లున్న లోక్‌ సభలో ఎన్డీయేకి 353 మంది సభ్యులతో కూడిన సాధారణ మెజారిటీ ఉంది. కానీ 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఈ కూటమికి 102 మంది ఎంపీలే ఉన్నారు. త్రిపుల్‌ తలాక్‌ వంటి అత్యంత ముఖ్యమైన బిల్లుల ఆమోదానికి ఇది అవరోధంగా మారింది. గత ఎగువ సభలో ఈ బిల్లును ప్రతిపక్షంతో బాటు బీజేపీ మిత్ర పక్షమైన జేడీ-యు కూడా వ్యతిరేకించింది. ఈ బిల్లులో పలు సవరణలు చేయాలని కోరింది. దీన్ని పార్లమెంట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా-ఆదివారం జరిగిన అఖిల పక్ష భేటీకి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషీ, అర్జున్‌ రామ్‌ మేఘవల్‌, రాజ్‌ నాథ్‌ సింగ్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు డెరెక్‌ ఓ బ్రెన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. జులై 5 న కేంద్ర బడ్జెట్‌ ను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close