లంగ పంచాయతీలు పెట్టొద్దు

Do not get anchored panchayat : KCR

0
  • మోడీ 15 లక్షలు ఏవీ
  • జూన్‌ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం
  • మతం పేరుతో రాజకీయాలు

నిర్మల్‌: చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం..ఐదేళ్ల క్రితం కరెంట్‌ విషయంలో ఆగమాగం ఉండే. ఇపుడు కరెంట్‌ కష్టాలు తీరాయి.. ఇపుడు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నం. ఇపుడు దేశంలో అత్యధిక తలసరి వినియోగం మనదేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. నిర్మల్‌ టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ..పెన్షన్‌ వెయ్యి రూపాయలు అందిస్తున్నం…మే 1 నుంచి రూ.2000 ఇస్తం. రైతు బంధు పథకం కింద ఎకరానికి ఇప్పటివరకు రూ.8000 ఇచ్చినం. ఇక నుంచి ఎకరానికి ఏడాదికి రూ.10,000 ఇస్తం. రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నం. చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందిస్తున్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌ అని విద్యుత్‌ ప్రాధికార సంస్త చెప్పింది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వల్లే నిర్మల్‌ జిల్లాగా ఏర్పడింది. పీఎఫ్‌ కార్డు ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తం. దేశంలో 18 రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వడం లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నం. ఆదిలాబాద్‌ జిల్లా తెలంగాణకు కాశ్మీర్‌ లాంటిదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎస్సారెస్పీ ద్వారా నిర్మల్‌, ముథోల్‌లో 50వేల ఎకరాలకు సాగునీరందిస్తామని సీఎం తెలిపారు. . ఆదిలాబాద్‌లో సారవంతమైన భూములున్నాయి. తుమ్మిడిహట్టి నుంచి రెండు లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. ఏడాదిన్నరలో పచ్చని పంట పొలాలతో ఆదిలాబాద్‌ కళకళలాడుతదన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తం. మంచిర్యాల రైతు ఫేస్‌బుక్‌లో వీడియో పెడితే నేను పరిష్కరించానని సీఎం ఈ సందర్భంగా అన్నారు. జూన్‌ తర్వాత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తం. భూ యజమానికి సంపూర్ణమైన హక్కును కల్పిస్తం. పాస్‌బుక్‌లో 36 కాలంలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారు. పహణి, నకల్‌ను మార్చిసినం. రైతులు ఎమ్మార్వో ఆఫీస్‌ చుట్టూ తిరగకుండాచూస్తాం. రైతులకు గిట్టుబాటు ధర రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.

బీజేపీ సిగ్గు మాలిన పార్టీ..

బీజేపీ సిగ్గు మాలిన పార్టీ అని సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో 10 కోట్ల మందికి ఉగ్యోగాలిస్తమని చెప్పింది. కోటి మందికన్నా ఉద్యోగాలు ఇచ్చిందా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు . బ్లాక్‌మనీ తీసుకొచ్చి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోడీ అన్నడు. 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. పసుపు బోర్డు పెట్టమని మోడీని ఎన్నోసార్లు అడిగినా పట్టించుకోలేదు. ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోకుండా ఇపుడు బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నరు. ఇపుడు ఎన్నికలు రాగానే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వస్తే చాలు పాకిస్థాన్‌, హిందువుల విషయాలు మోడీకి గుర్తుకొస్తయి. మతం పేరుతో మోడీ రాజకీయాలు చేస్తున్నడు. బీజేపీ ఎన్నికలు రాగానే హిందూ, ముస్లింల మధ్య గొడవ పెడుతుంది. కుల, మతాల పంచాయతీ పోతేనే దేశం బాగుపడ్తది. గిరిజనులు, దళితులు, గౌరవించబడితేనే దేశం పురోగమిస్తుందని సీఎం స్పష్టం చేశారు. దేశంలో 3 లక్షల 44వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ శక్తి ఉంది. దేశం వాడుతున్నది కేవలం 2లక్షల 20వేల మెగావాట్లు మాత్రమే. ఛత్తీస్‌గఢ్‌లో 27వేల మెగావాట్ల విద్యుత్‌ శక్తి వృథాగా పడి ఉంది. 193 కిలోవిూటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్‌ అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు.

జూన్‌ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం

జూన్‌ తర్వాతే దేశం ఆశ్యర్య పోయే విధంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. రెవెన్యూ భూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. నెల రెండు నెలలు ఓపిక పట్టండి. రైతులు ఎమ్మార్వో కార్యాలయాల చుట్టు తిరిగే పని లేకుండా చేస్తామని చెప్పారు. రెండేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కళకళలాడుతుంటది..భూములకు సంబంధించిన సకల సమస్యలను పరిష్కరిస్తామని..భూమి అమ్మినా..కొన్నా గంటలో వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ అయ్యే విధంగా కొత్త టెక్నాలజీని తీసుకొస్తామన్నారు. రైతులు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ సూచించారు. తాను స్వయంగా ప్రతి జిల్లాల్లో రెండు…మూడు రోజులు ఉండి భూ సమస్య లేకుండా చేస్తానన్నారు. ఎవరి భూమి ఏంటో తెలుసుకుని అధికారికంగా వారికి పాస్‌ బుక్‌ ఇవ్వడమే కాకుండా భూ యజమానికి సంపూర్ణ హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఆధునాతనంగా..కొత్తగా రెవెన్యూ చట్టం ఉంటుందని కేసీఆర్‌ వెల్లడించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హావిూనిచ్చారు. రైతు చనిపోతే కుటుంబానికి రూ. 5 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజన చేయాలని కోరారని..తెలంగాణ రాష్ట్రం రాకపోతే నిర్మల్‌ జిల్లా అయ్యేదా ? అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల కళ్లెదుటే ఉన్నాయని గమనించాలని కేసీఆర్‌ సూచించారు. పసుపు బోర్డు కోసం ఐదేళ్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని వందల కొద్ది ధరఖాస్తులు పెట్టినా కేంద్రం నుంచి స్పందించలేదని ఆరోపించారు. ఎన్నికలు రాగానే హిందువులు, ముస్లింలు అంటూ మతవిద్వేశాలు రెచ్టగొడుతున్నారు తప్ప ప్రజలకు ఏం మేలు చేశామని చెప్పలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో 10 కోట్ల మందికి ఉగ్యోగాలిస్తమని చెప్పింది. కోటి మందికన్నా ఉద్యోగాలు ఇచ్చిందా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. బ్లాక్‌మనీ తీసుకొచ్చి ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోడీ అన్నడు.చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమని ఐదేళ్ల క్రితం కరెంట్‌ విషయంలో ఆగమాగం ఉండే. ఇపుడు కరెంట్‌ కష్టాలు తీరాయి. ఇపుడు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నం. ఇపుడు దేశంలో అత్యధిక తలసరి వినియోగం మనదేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here