రైతుల డాటా సేకరణపై ప్రత్యేక దృష్టి

0

రైతుబంధు ద్వారా అందించే పెట్టుబడి సహాయం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు చేరేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. ఎన్నికల కోడ్, విధులు ముగిసినందున రైతుల డాటా సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 
సోమవారం రైతు బంధు, 2021 జనాభా లెక్కల సమీకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో సి.యస్ డా.ఎస్ కె.జోషి సచివాలయంలో వీడియోకాన్ఫరెన్స్ ను నిర్వహించారు. 
ఈ సమావేశంలో జి.ఎ.డి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా , వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారథి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here