రైతాంగానికి బాసటగా అనేక పథకాలు

0

తూర్పు ఆఫ్రికా దేశం రువాండ మాజీ వ్యవసాయ శాఖా మంత్రి టోని సంగనిరా

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లుగా వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని, నిరాశలో ఉన్న రైతాంగానికి బాసటగా అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతులలో ఆత్మస్థయిర్యం నింపడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తూర్పు ఆఫ్రికా దేశం రువాండ మాజీ వ్యవసాయ శాఖా మంత్రి టోని సంగనిరా హైదరాబాద్ పర్యటన సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వ్యవసాయరంగంలో యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ సంస్థలో ఆయన సభ్యునిగా కూడా ఉన్నారు.

రాబోయే రోజులలో తెలంగాణ స్వరూపమే మారబోతుందని, వ్యవసాయం లాభసాటిగా మార్చడం, యువత ఉద్యోగాలకోసం ఆధారపడకుండా ఈ రంగంలో ఉపాధి చూసుకుని స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. గత నాలుగున్నరేళ్లలో తెలంగాణలో వ్యవసాయరంగం పట్ల తీసుకున్న నిర్ణయాలను టోని సంగనిరా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రంగంలో యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ భేటీలో పౌరసరఫరాల శాఖ కమీషనర్ అకున్ సభర్వాల్, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి గారు టోనీ సంగనీరాను సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here