రేవంత్‌ పేరెత్తకుండానే ప్రసంగం ముగించిన కేసీఆర్‌

0

కొడంగల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొడంగల్‌ పర్యటన ముగిసింది. నేరుగా తనపైనే మాటల దాడికి దిగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రస్తావన లేకుండానే కేసీఆర్‌ ప్రసంగం పూర్తవ్వడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. స్థానిక అభ్యర్థైన రేవంత్‌ పేరును మాటమాత్రంగానైనా ప్రస్తావించక పోవడం గమనార్హం. ఎక్కడికివెళ్లినా అక్కడి అభ్యర్థిని ఓడించండంటూ ఓటర్లను కోరే కేసీఆర్‌..ఇక్కడమాత్రం టీడీపీ, కాంగ్రెస్‌లను మాత్రమే విమర్శించి రేవంత్‌ను పట్టించుకోనట్టే వ్యవహరించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ… నిరసనగా కేసీఆర్‌ కొడంగల్‌ పర్యటనను అడ్డుకుంటామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అయితే ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని.. కేవలం ధర్నాలు, రాస్తారోకోలు మాత్రమే చేపడతామని రేవంత్‌ తెలిపారు. దీంతో ఆయన్ను అర్ధరాత్రి సమయంలో అరెస్ట్‌ చేశారు. రేవంత్‌ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. నాటకీయ పరిణామాల మధ్య.. కోర్టు ఆదేశాలతో రేవంత్‌ రెడ్డిని మంగళవారం సాయంత్రం పోలీసులు విడుదల చేశారు. అయితే రేవంత్‌ గురించి కేసీఆర్‌ ఏమైనా మాట్లాడాతారా అన్న ఆసక్తితో అందరూ ఎదురుచూడగా ఆ ఆశలపై నీళ్లు చల్లారు కేసీఆర్‌. దాదాపు 20 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో కొడంగల్‌ అభివ ద్ధి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలదు. అనంతరం తనకు వేరే సభ ఉందంటూ ప్రసంగాన్ని ముగించారు. తెలంగాణ కోసం తాను చావు నోట్లో తలపెట్టానని, అలా అయితేనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా కోస్గీలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్రోళ్ల చేతికి అప్పగిస్తారా? అని సభికులను ప్రశ్నించారు. దేశంలో సొంత ఆర్థిక వనరులు కలిగిన రాష్ట్రం మనదేనని, కొడంగల్‌ను అభివ ద్ధి చేసే బాధ్యత తనదేనని కేసీఆర్‌ అన్నారు. కొడంగల్‌లో నర్సింగ్‌ కాలేజీ, బస్‌ డిపోలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కొడంగల్‌లో 41 తండాలను గ్రామపంచాయతీలు చేశామని కేసీఆర్‌ గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here