Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలి

పిఎంఎవై సబ్సిడి పథకంపై అవగాహణ….

ప్రాసెసింగ్‌ చార్జీలు లేకుండానే ఇల్లు, కారు రుణాలు

తక్కువ వడ్డీకే లన్‌ అందిస్తున్న ఏకకై బ్యాంకు ఎపిజివిబి

ాఎపిజివిబి షాద్‌నగర్‌ శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ రవికాంత్‌

జిల్లేడ్‌చౌదరిగూడెం (ఆదాబ్‌ హైదారాబాద్‌): అన్ని బ్యాంకుల కన్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు అతి తక్కువ వడ్డీరేట్లతో గృహము, కారు, అభరణములపై ఏలాంటి ప్రాసెసింగ్‌ చార్జీలులేకుండానే రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఎపిజివిబి షాద్‌నగర్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ రవికాంత్‌ అన్నారు. బుదవారం నాడు చౌదరిగూడెం మండల కేంద్రంలోని ఆర్యసమాజం మందిరంలో ఏర్పాటు చేసిన ఎపిజివిబి రుణామేళా అవగాహన సదస్సులో పాల్గని బాంకు ద్వారా అందించే రుణాలపై వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడితో కూడిన గృహ నిర్మాణం కొరకు బ్యాంకు నిబంధనల ప్రకారం రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతరు ఏ బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంలేదని కేవలం ఎపిజివిబి మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం జరుగుతుందని ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతే కాకుండా అతి తక్కువ ప్రిమియంతో ఇన్స్‌రెన్సు చేసుకునే అవకాశం ఉందని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి భిమా ఎంతో అవసరమని తెలియక ఇలాంటి భిమా సౌకార్యాలను చాలా మంది పొందలేకపోతున్నారని ఆయన అన్నారు. ఎపిజివిబి ద్వారా జీవిత భీమా, ఆరోగ్య భీమా, వ్యక్తిగత ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. బ్యాంకు అందిస్తున్న రుణాలు కాని, భీమా వంటి సేవలను ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అందులో భాగంగానే ఎపిజివిబి ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా చౌదరిగూడెం పెద్ద వాణిజ్య కేంద్రం కావడంతో గృహము, వ్యక్తిగత గోల్డ్‌లోన్‌, మార్టీగేజ్‌లోన్‌, కారులోన్‌ పై తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రుణాలు పొందడానికి మూడు సంవత్సరాల ఐటితో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర డ్యాక్యుమెంట్లు కలిగిన ప్రతి ఒక్కరు అర్హులని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకుకల్పిస్తున్న రుణ సౌకార్యాలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటీసిలు, ప్రజాప్రతినిధులు గ్రామాలలో ప్రజలకు తెలిజేయాలని ఆయన కోరారు. రుణాలు గురించి మరింత సమాచారం తెలుసుకునెందుకు సమీపంలోని ఎపిజివిబి బ్రాంచ్‌ మేనేజర్లను సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకొని బ్యాంకు అందిస్తున్న తక్కువ వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిజివిబి షాద్‌నగర్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ బి.వనజాక్షి, ఎపిజివిబి బ్రాంచ్‌ మేనేజర్‌ సాయిప్రసాద్‌రెడ్డి, పి. శివరాంరెడ్డి, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్‌, పెద్ద ఎల్కిచర్ల సర్పంచ్‌ కమ్మరి భూపాలచారి, నీలం నర్సింలు, కంచారి అశోక్‌, గూడూరు చిన్న రాంరెడ్డి, శివ, రొక్కం కిష్టయ్య, కోవూరి సింహ్మయ్యలతో పాటు వివిధ గ్రామాలను ఖాతాదారులు, ప్రజలు పాల్గన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close