Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

రామయ్య గూడ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

చెల్లెలు హత్యకు ప్రతీకారం తీర్చుకున్న బావమరిది.మరో ఇద్దరు నిందితుల పరారీ  వికారాబాద్ సి ఐ శ్రీనివాస రావు వికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్. వికారాబాద్ పట్టణంలోని రామయ్య గూడా లో  దారుణ హత్యకు గురైన సత్యనారాయణ కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను కొత్త గుడి దగ్గర అరెస్టు చేసినట్లు వికారాబాద్ సీఐ శ్రీనివాసరావు తెలియజేసారు హతుడి బావమరిది వెంకటేష్ తన మిత్రులతో కలిసి హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు సత్యనారాయణ కు వెంకటేష్  చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేశారు ఆమెని చిత్రహింసలకు గురిచేసి e హత్య చేసిన కారణంగా బావను హత్య చేయడానికి బామ్మర్ది వెంకటేష్ పథక రచన చేసినట్లు చెప్పారు రు రాఖీ పౌర్ణమి రోజున తన చెల్లెలు గుర్తుకు వచ్చి హత్య చేసినట్లు తెలియజేశారు నిందితుడు వెంకటేష్ తో పాటు ఆయన మిత్రులు ఆనంద్ నర్సింలు శ్రీకాంత్ రాఖీ పౌర్ణమి రోజున మద్యం సేవిస్తూ వెంకటేష్ తన చెల్లెల్ని గుర్తుచేసుకొని రోదించారు అదే సమయంలో అటుగా తన చెల్లెలి భర్త సత్యనారాయణ వెళ్లడంతో మందు తాగాలని వారు అడిగారు హతుడు సత్యనారాయణ మద్యం బాటిల్స్ తీసుకొనివచ్చి తాగుతూ వెంకటేష్ చెల్లెలు గురించి ప్రస్తావించడంతో మాట మాట పెరిగి గొడవలకు దారి తీస్తుంది వెంకటేష్ ఆగ్రహంతో సత్యనారాయణ తలను సి సి రోడ్డుపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయమైంది ఇరుగుపొరుగువారు సర్ది చెప్పగా ఒక ఆటలో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆటో లోకి చొరబడి వెంకటేష్ నర్సింలు సత్యనారాయణ పై దాడిచేసి చంపడాన్ని ప్రయత్నించారు ఆటో డ్రైవర్ జోక్యం చేసుకోవడంతో ఆట నుంచి లాగి కత్తితో పొడిచి హత్య చేశారు అనంతరం నిందితులు కత్తిని ఇంట్లో పెట్టి పరారీ అయ్యారు కొత్త గడి నుంచి బీదర్ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకుని తరలించారు మరో ఇద్దరు నిందితులు శ్రీకాంత్ ఆనందు లు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తారని వికారాబాద్ సీఐ శ్రీనివాసరావు తెలియజేసారు కాగా హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసారుAttachments area

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close