Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

యరపతినేనికి బిగిసిన ఉచ్చు

ఏపిలో తొలి సిబిఐ కేసు

? రూ.156 కోట్ల స్కాం బట్టబయలు

? డజను మంది నిందితులు

? రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు కూడా

? ‘ఆదాబ్‌’కు హత్యా బెదిరింపులు

? ధైర్యంగా కథనాలు ప్రచురణ

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ప్రజాప్రతినిధుల ముసుగులో కోట్లు కొల్లగొట్టారు. అప్పనంగా వచ్చిన సొమ్ము… ఎన్నికల్లో కోట్లు కుమ్మరించారు. ఓ మామూలు ఎమ్మెల్యే ఏకంగా వందల కోట్లు సంపాదించడం సాధ్యమేనా..? ఈ దౌర్భాగ్య నాయకగణాలు సుసాధ్యం చేస్తూ… ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా రూ.156 కోట్లు దోచేశారు. దాచేశారు. నాటి పల్నాటి పౌరుషం కొందరిలో పక్కదారి పట్టి… బెదిరింపులు, కిడ్నాప్‌, హత్యలకు నేడు కేంద్రీకృతమైంది. ‘ఫ్యాక్షన్‌ ప్యాషన్‌’ లో కోట్లాది రూపాయల ప్రజాధనం.. దర్జాగా నల్లబజారుకు నిసిగ్గుగా, నిస్సంకోచంగా, నిస్తేజంగా… అవినీతి అధికారుల సాక్షిగా నిశ్శబ్దంగా తరలిపోయింది. సిగ్గులేని తనమే సింగారంగా… నిలువుటద్దంలో తమ నీచపు పనులను సగర్వంగా చూసుకుంటూ… అధికారుల అండతో అడ్డంగా .. కోట్లు నాకేసి, మింగేసిన

నాయకులారా… ఇక జాగ్రత్త. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ఆగస్టు6, 2019న

”తాజా మాజీ ఎమ్మెల్యే…

‘యరపతినేని’ ఏందీ పని..!” …. అంటూ ఓ సంచలన పరిశోధన కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రచురించ వద్దంటూ.. ‘ఆదాబ్‌’కు చంపుతామనే బెదిరింపులు సైతం వచ్చాయి. అయినా వెనుకడగు వేయలేదు. ఇక ముందు వేయదు కూడా. ధైర్యంగా… అక్రమాల తీరు తెన్నులను ఆధారాలతో సహా బయటపెట్టింది. ఎట్టకేలకు యరపతినేని బాగోతం బజారెక్కింది. తాజాగా సిబిఐకి చేరింది. వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐకి వెళ్లిన తొలికేసు ఇదే కావడం విశేషం.

ఇప్పుడేం జరిగింది..:

తాజా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసిన సీఐడీ విభాగం దర్యాప్తునకు సంబంధించిన వివరాలను కూడా సీబీఐకి పంపింది. రాష్ట్రంలో సాధారణ సమ్మతి (జనరల్‌ కన్సెంట్‌) పునరుద్ధరణ తర్వాత సీబీఐకు తొలికేసు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగింది:

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి, పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా కొనసాగింది. రూ.వేల కోట్ల విలువ చేసే లైమ్‌ స్టోన్‌ (సున్నం రాయి) నిక్షేపాలు అప్పటి ఎమ్మెల్యే యరపతినేని అండదండలతో మైనింగ్‌ మాఫియా కొల్లగొట్టింది.

మొత్తం రూ.320 కోట్లు..:

పల్నాడులో టన్ను సగటు ధర రూ.800 వరకూ ఉంది. దీని ప్రకారం రూ.320 కోట్ల వరకూ అక్రమ వ్యాపారం జరిగినట్లు ‘ఆదాబ్‌’ అనేక ఆధారాలను బయటపెట్టింది. స్వయంగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాలను రహస్యంగా అనేక సార్లు సందర్శించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు, రాయల్టీ, గతంలో అమ్మకం పన్ను, ఇప్పుడు జిఎస్టి మొత్తంగా ప్రభుత్వానికి భారీగా ఎగవేతకు పాల్పడినట్టు బయటపెట్టింది.

జిల్లా అధికారుల మల్లగుల్లాలు:

‘ఆదాబ్‌’ కథనాల తరువాత అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఎలా ఈ బాగోతం బయటకు రాకుండా చేయాలని అనేక కట్టు కథలు అల్లారు. అనుకూలమైన విూడియాలో తప్పుడు కథనాలు సృష్టించారు. శాటిలైట్‌ ఛాయా చిత్రాలను పోలుస్తూ దిమ్మ తిరిగే ఆధారాలను ‘ఆదాబ్‌’ ధైర్యంగా ప్రచురించింది. నాటి జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ మైనింగ్‌, రెవెన్యూ శాఖ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. సిబిఐ, కాగ్‌, కేంద్ర గనుల శాఖలకు ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా అధికారులు ఉలిక్కిపడ్డారు. బేరసారాలకు లొంగక పోవడంతో హత్యలు తామకు కొత్త కాదనే సంకేతాలు ఇచ్చారు. ఎక్కడ ‘ఆదాబ్‌’ బెదరలేదు. సరికదా దూకుడు పెంచి కథనాలను ప్రచురించింది.

పట్టించిన శాటిలైట్‌..:

పల్నాడు కేంద్రంగా జరిగిన అక్రమ మైనింగ్‌ పై నేషనల్‌ రిమోట్‌ ఏజెన్సీ ద్వారా తీసిన ఫోటో చిత్రాలను ‘ఆదాబ్‌’ సేకరించి… కథనాలను అందించింది. ఈ ఫోటోల ఆధారంగా సున్నపురాయి అక్రమ మైనింగ్‌ వల్ల సర్కార్కు ఏమేరకు నష్టం వచ్చిందో ‘ఆదాబ్‌’ వివరంగా బయటపెట్టింది. వివరించింది. రూ.156 కోట్ల విలువైన సున్నపురాయి అక్రమంగా తరలివెళ్లినట్లు కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు.

అరెస్టులు ఎప్పుడు..?:

ఈ కేసులో యరపతినేనితో పాటు రెవిన్యూ, మైనింగ్‌ అధికారులు సుమారు పన్నెండు మంది ఉన్నారు. అయితే సిబిఐలో ఎఫైర్‌ కాగానే అరెస్టులు ఉండవు. ఆధారాలను, సాంకేతిక పరిజ్ఞానంతో సరిపోల్చుకుంటారు. అధికారుల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకొని సరిగ్గా ఎన్ని కోట్లు అక్రమాలు జరిగాయనే నిర్థారణకు వస్తారు. ఇలా సంపాదించిన డబ్బు ఎవరి వద్ద ఉంది..? ఎలా వహతరలించారు..? ఏ విధంగా..? ఎక్కడ ఖర్చుపెట్టారు..? అనే అంశాలపై కీలక ఆధారాలు సంపాదిస్తారు. ఆ తర్వాత అరెస్టులు, అక్రమ ఆస్తుల అటాచ్‌ మెంట్లు ఉంటాయి.

కొసమెరుపు:

అక్రమాలు జరిగాయని నిజాయితీగా, నీబ్బరంతో రాసిన ‘ఆదాబ్‌’.. సిబిఐ కేసు గురించి ప్రస్థుతం రాస్తుంది. రేపు అరెస్టుల గురించి రాస్తుంది. ఆ తర్వాత వారికౌ పడే శిక్షల గురించి రాస్తుంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. నిజాయితీగా రాసే ‘ఆదాబ్‌’ కలం నిబ్బరంగా తిరగాల్సిందే..!

జయ¬… మేరా భారత్‌ మహాన్‌… సత్యమేవ జయతే.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close