Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

మోడీతో ట్రంప్‌..

ఒకే వేదికపై మరోమారు..

  • ప్రకటించిన వైట్‌ హౌజ్‌ ప్రతినిధి
  • ఈ నెల 22న హ్యూస్టన్‌లో..

న్యూయార్క్‌

ఈ నెల 22న అమెరికాలోని హ్యూస్టన్‌ లో జరగనున్న హౌడీ మోడీమెగా ఈవెంట్‌ లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ కూడా పాల్గొనబోతున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటించింది. ఓ అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని కలిసి సంయుక్త ర్యాలీలో ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇద్దరు నేతలు ఒకే వేదికపై కలవడం రెండు దేశాల బంధాన్ని చాటి చెబుతుందని వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ స్టిఫెనీ గ్రిసామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్‌-మోడీల మధ్య జి20, జి 7 శిఖరాగ్ర సమావేశాల తర్వాత కొన్ని వారాల వ్యవధిలో వరుసగా ఇది మూడవ సమావేశం కావడం గమనార్హం. హ్యూస్టన్‌లోని విశాలమైన ఎన్‌ఆర్‌జి స్టేడియంలోఈనెల 22న జరగనున్న హౌడీ, మోడీ! షేర్డ్‌ డ్రీమ్స్‌, బైట్ర్‌ ఫ్యూచర్స్‌ కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుండి 50 వేల మంది అమెరికాలో స్థిరపడిన భారతీయులు రిజిస్టర్‌ చేసుకున్నారు. మోడీతో వేదిక పంచుకోవడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి చర్యలు.. ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు 2020 ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close