Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

మెట్రో కిల్లర్‌..

నాణ్యతలో అన్నీ లోపాలేనా..

మెట్రో నుంచి ఊడుతున్న పెచ్చులు..

ఇప్పటికే బలైపోయిన ప్రాణం..

రసూల్‌పూర్‌లో మరో ఘటన..

వరుస సంఘటనలతో ప్రయాణీకుల ఆందోళన..

వేల కోట్ల రూపాయలు.. సంవత్సరాల తరబడి ఇంకా చేస్తున్న పనులు.. ఎక్కడ నాణ్యత లోపం రాకుండా, ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్వాలేదంటూ మెట్రో పనులు చేస్తున్నారు. మెట్రోలో ఉన్న ఒక పిల్లర్‌ నిర్మాణం చూస్తే చెక్కుచెదరకుండా పది, ఇరవై సంవత్సరాలు ఉండేలా నిర్మాణం చేస్తున్నామని చెప్పినా అధికారులు ప్రస్తుతం మెట్రోలో జరుగుతున్న పరిస్థితులు నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీనిర్మాణంతో చేపట్టిన మెట్రోలో ఎంత మేరకు నాణ్యత ఉందో అర్థం కావడం లేదు. నగరంలోని నగర పౌెరులకు ట్రాఫిక్‌ వల్ల ఇబ్బంది కలుగకుండా అందరూ మెట్రోలో ఏలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రయాణం కొనసాగించవచ్చనే ఆలోచనతో ఉన్నవారే. నగరంలో ఐదు కిలోమీటర్లు వెళ్లాలనే ఇంచుమించుగా అరగంటకు పైగా పడుతోంది. దానికి తోడు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కాలుష్యానికి నగర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎంతో, కొంత ఊరట కలుగుతుందని సంతోషపడుతున్న వారికి మెట్రో పిల్లర్లు ప్రాణాలు తీస్తున్నాయి. చెక్కుచెదరకుండా ఉంటున్నాయని చెప్పినా అధికారులు, మరీ నాణ్యత ఎక్కడ ఉందో, ఏలా ఉందో చెప్పాలని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్‌లో ప్రయాణం ఇబ్బందిగా ఉందని ఎక్కువమంది ఇప్పుడు మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్‌లో సమయం లేటైనా ప్రాణాలు మాత్రం మిగిలేవని కాని ఇప్పుడు మెట్రోలో ప్రయాణించాలన్నా, మెట్రో కింద నిలబడాలన్నా ప్రయాణీకులకు వణుకు పుడుతోంది. మెట్రో స్టేషన్ల నుంచి ఎప్పుడు ఏ పెచ్చు ఊడుతుందో ఎవరి ప్రాణాలు పోతున్నాయో తెలియక ఇప్పుడు నగర ప్రజలు ఆందోళనతో ఉన్నారు. మెట్రో నాణ్యత కూడా నాలుగురోజులేనని ఆలోచన ఇప్పుడు అందరిలో మొదలయింది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

హైదరాబాద్‌కి మెట్రో వస్తుందంటే అందరిలో ఒక రకమైనా ఆనందం.. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణలో ఉంటుంది. కాలుష్యానికి గురికాకుండా ఆనందంగా కార్యాలయాలకు వెళ్లాలనుకున్న నగర ప్రజలకు మెట్రో అంటేనే వణుకు మొదలయింది.. హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల భాగస్వామ్యాన్ని చూసింది హైదరాబాద్‌ మెట్రో. మరో ప్రత్యేకత కూడా నగర మెట్రో రైల్‌ కి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన మెట్రో రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల విూదుగా ప్రారంభమైన హైదరాబద్‌ మెట్రో రైల్‌ కి ప్రజాధారణ బాగా పెరిగింది. ట్రాఫిక్‌ సమస్యలు, కాలుష్యం నుండి దూరంగా ప్రయాణం చేయడమే కాకుండా వేగవంతమైన ప్రయాణం కోసం చాలా మంది నగర వాసులు మెట్రో ప్రయాణాన్నిఅలవాటు చేసుకున్నారు. అంతే కాకుండా మెట్రో స్టేషన్లు చాలా విశాలంగా ఉండడంతో వర్షం పడుతున్న సమయంలో చాలామంది ద్విచక్ర వాహన దారులు, పాదచారులు మెట్రో స్టేషన్ల క్రింద తడవకుడా ఉండిపోవడం, వర్షం తగ్గిపోగానే వెళ్లి పోవడం నిత్యకృత్యంగా మారింది. హైదరాబాద్‌కే తలమానికం అని గొప్పగా చెప్పుకుంటున్న మెట్రో .. ఇప్పుడు సామాన్యుల పాలిట కిల్లర్‌గా మారిందా..? పెచ్చులూడుతూ ప్రయాణికుల ప్రాణాలను హరిస్తుందా..? వరుసగా జరుగుతున్న ఘటనలతో ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.. దీంతో వామ్మో.. మెట్రో అంటూ ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం సాయంత్రం మౌనిక మృతితో మెట్రో కింద ప్రయాణం సాగించాలన్నా.. మెట్రో ట్రైన్‌ ఎక్కేందుకు వెళ్లాలన్నా ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అవిూర్‌పేట ఘటన మరువక ముందే సోమవారం మెట్రో నుంచి పెచ్చులూడి పడ్డాయి.. ఆ సమయంలో ప్రయాణీకులు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది.

మెట్రో నాణ్యతలో కూడా లోపమేనా..

పూర్తి భద్రతా ప్రమాణాలతో తక్కువ వ్యవధిలో నిర్మించామని పలు సందర్భాల్లో నేతలు, మెట్రో అధికారులు ఘనంగా చెప్పుకొచ్చారు. దశాబ్దాల పాటు ఢోకా లేకుండా ఉంటుందని, వందేళ్లు సేవలందిస్తుందని గొప్పగా చెప్పారు. కానీ అవిూర్‌ పేటలో మౌనిక అనే వివాహిత మహిళ మృతి చెందిన ఘటనతో నగరమంతా ఉలిక్కిపడింది. మెట్రో ఇన్నాళ్లూ సాంకేతిక లోపాలతో ఇబ్బంది పెట్టగా.. ఇప్పుడు నిర్మాణ లోపాలతో భయపెడుతోంది. పలు చోట్ల వయాడక్ట్‌ నుంచి సిమెంట్‌ పెచ్చులు ఊడిపతున్నాయి. దీనికితోడు సోమవారం ఉదయం మరో ప్రమాదం తప్పింది.. రసూల్‌పుర మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి పడిపోయాయి. అవిూర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో పెచ్చులు ఎలా ఊడాయో రసూల్‌ పురాలోనూ అదేరీతిలో పెచ్చులూడిపడ్డాయి.. ఆ సమయంలో ప్రయాణీకులెవరూ అక్కడ లేకపోవటంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదాలకు హడావుడిగా మెట్రో నిర్మాణ పనులు ముగించటం కారణంగా స్థానికులు పేర్కొంటున్నారు. దీనికితోడు ప్రీ కాస్ట్‌ కాంక్రీట్‌ నిర్మాణానికి దానిపైన బాండింగ్‌కు పటిష్ఠత లేకపోవటం, మెట్రో ట్రాక్‌ నిర్మాణం హడావుడిగా పూర్తిచేయడం, పిల్లర్లు, వయాడక్ట్‌ సెగ్మెంట్ల మధ్య ఖాళీలను పటిష్ఠంగా పూడ్చక పోవటం, మెట్రోట్రైన్‌ నడుస్తున్నా.. స్టేషన్‌లలో పనులు నిర్వహించటంతో పిల్లర్లు వణికి పెచ్చులూడి కిందపడుతున్నాయని తెలుస్తోంది.

పగుళ్లతో స్వాగతం పలుకుతున్న గోడలు..

నిర్మాణ సమయంలో పర్యవేక్షణ కొరవడడంతో ఏ స్టేషన్‌ లో చూసినా బీటలు వారిన గోడలు దర్శనమిస్తున్నాయి. ప్రతి స్టేషన్‌ లోనూ సివిల్‌ పనుల్లో లోపాలు రోజులు గడిచేకొద్దీ బయటపడుతున్నాయి. వయాడక్ట్‌ పైన శబ్ద నియంత్రణకు దోహదపడేలా అటు ఇటు నిర్మించిన ప్రహరీ నుంచి కొన్ని వస్తువులు వేలాడుతూ కింద ఉన్నవారిని భయపెడుతున్నాయి. మెట్రో స్టేషన్లలో గోడలకు బీటలు రాగా, మరుగుదొడ్ల మురుగు రోడ్లపైకి వస్తోంది. స్టేషన్‌ లోని మరుగుదొడ్ల నుంచి నీరు లీకేజీపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల వినాయక చవితి నవరాత్రుల్లో ఖైరతాబాద్‌ స్టేషన్‌ దగ్గర ఎస్‌ బీఐ బ్యాంకు మార్గంలో వరద లీకై భక్తులపై పడింది. ఇలా పలు ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో మెట్రో అంటేనే ప్రయాణికులు, నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. స్టేషన్ల కింద సుందరంగా తీర్చిదిద్దే పనుల కోసం ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేశారు. చాలా స్టేషన్లలో ఆ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అసెంబ్లీ, నాంపల్లి, గాంధీ భవన్‌, ఉస్మానియా ఆస్పత్రి స్టేషన్‌ పరికరాలు అస్తవ్యవస్తంగా ఉన్నాయి. పాద బాటలు వదిలేశారు. మెట్రో రైలులో సాంకేతిక లోపాలు ప్రయాణికులు చికాకు పెడుతున్నాయి. ఆదివారం గాంధీభవన్‌ దగ్గర మెట్ర్‌ రైలు సడన్‌ బ్రేకులతో ఎగిరికింద పడటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇదే చివరి స్టేషన్‌ అంటూ ప్రకటన విన్పించిందని ప్రయాణికులు తెలిపారు. వరుసగా జరుగుతున్న సంఘటనలపై మెట్రో అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించ లేదు. మెట్రో స్టేషన్‌ల నాసిరకం నిర్మాణాలు రెండేళ్ల తరువాత ఒక్కొక్కొటిగా బయటపడుతుండటంతో మెట్రో నిర్మాణ సంస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా, మరో ప్రాణం బలికాకుండా మెట్రో నిర్మాణ సంస్థ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటో వేచి చూడాల్సిందే.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close