Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలు

ముస్తాబైన గోల్కొండ కోట

పంద్రాగస్ట్‌ వేడుకలకు సర్వం సిద్ధం

  • భారీగా పోలీస్‌ బందోబస్తు
  • ఐదేళ్ల దార్శనికతపై ప్రసంగంలో పెద్దపీట
  • ప్రజలకు సందేశం ఇవ్వనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట ముస్తాబైంది. భారీగా బందోబస్తు ఏర్పాట్లుచేయడంతో పాటుకోటను అందంగా అలంకరించారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయంతో వరుసగా ఐదోసారి కెసిఆర్‌ జెండా ఎగురేయబోతున్నారు. ఇక్కడి నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ యేడు బాగా వర్షాలు పడి జలకళను సంతరించుకోవడం,కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తి కావడం వంటి విజయాలు సిఎం కెసిఆర్‌కు బాగా కలసివచ్చిన అంశాలుగా చూడాలి. అలాగే పొరుగున ఎపిలో కొత్త ప్రబుత్వం ఏర్పడడంతో పాటు, సిఎం జగన్‌తో చర్చలు,గోదావరి జలాల వినియోగంపై ప్రత్యేక ప్రస్తావనచేసే అవకాశం ఉంది. సాధారణంగా పాలనలో తీసుకున్న చర్యలను,సాధించిన విజయాలను సిఎం వివరిస్తారు. రానున్న రోజుల్లో తీసుకోబోయే కార్యక్రమాలను విడమరుస్తారు. అలాగే అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. గతంలో పరేడ్‌ గ్రౌడ్స్‌లో జరిగిన పంద్రాగస్ట్‌ వేడుకలు ఇప్పుడు గోల్కొండ వేదికగా ఏటేటా సాగుతున్నాయి. దీంతో ఈ యేడు కూడా పంద్రాగస్టు వేడుకలకు చారిత్రక గోల్కొండకోటను అన్ని రకాల హంగులతో ముస్తాబు చేసారు. గురువారం నిర్వహించే కార్యక్రమాలపై ఇప్పటికే రిహార్సల్స్‌ పూర్తయ్యాయి. భద్రత కార్యక్రమాల రిహార్సల్స్‌తోపాటు పోలీసు, వివిధ భద్రత బలగాలు కవాతు నిర్వహించాయి. విద్యార్థులు కూడా పలు కార్యక్రమాలపై రిహార్సల్స్‌ చేశారు. నిఘావర్గాల సూచనల మేరకు అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారులు చెప్పారు. మరోవైపు విద్యుత్‌దీప కాంతులతో వారసత్వ సంపద ధగధగలాడుతున్నది. వేడుకలు జరిగే హైదరాబాద్‌లోని గోల్కొండ కోట పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించింది. ఇందుకు పోలీసుశాఖలోని అన్ని విభాగాల సేవలను వినియోగిస్తున్నట్టు సీనియర్‌ అధికారులు తెలిపారు. వేడుకలకు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వచ్చే రూట్‌లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతుండగా మరోవైపు సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. భద్రత నేపథ్యంలో పోలీసు, పురావస్తుశాఖల అధికారులు భేటీ అయ్యారు. పోలీసుల సూచనలకు అనుగుణంగా పురావస్తుశాఖ అధికారులు సహకరిస్తూ, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆధ్వర్యంలో గోల్కొండకోట వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ప్రధానంగా పంద్రాగస్టు వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెళ్లేమార్గంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రగతిభవన్‌ నుంచి గోల్కొండకోట కాన్వాయ్‌ వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. దారి పొడువునా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించారు. ఆయాప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు కూడా పలుసూచనలు చేశారు. పశ్చిమ మండలం డీసీపీ స్థానిక పోలీసులతో సమావేశమై భద్రతపై అన్నిరకాల సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పటికే డిజిపి మహేందర్‌ రెడ్డి, సిఎస్‌ ఎస్‌కె జోషి ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట రోడ్డును మూసివేస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వేడుకల నేపథ్యంలో గోల్కొండ, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, వేడుకలకు హాజరయ్యే ప్రజలు హ్యాండ్‌ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేసులు, కెమెరాలు, టిఫిన్స్‌ లాంటి వస్తువులను తీసుకురావద్దని ఆయన సూచించారు. ఈ రకమైన వస్తువులను వెంట తెచ్చుకుంటే వారిపై చర్య లు ఉంటాయని సీపీ తెలిపారు. వేడుకలకు హాజరయ్యే సాధారణ ప్రజలు తమ వాహనాలను హుడా పార్కు, సెవన్‌ టూంబ్స్‌ వద్ద పార్కు చేయాలి. వేడుకలు పూర్తయిన తరువాత ఏబీసీ కారు పాసు ¬ల్డర్స్‌ మాకై దర్వాజా, రాందేవ్‌గూడ వైపు నుంచి బయటకు వెళ్లిపోవాలి, డీ కారు పాసు ¬ల్డర్స్‌ బంజారా దర్వాజ, సెవెన్‌ టూం బ్స్‌ వైపు వెళ్లాలి. ఇ, ఎఫ్‌ పాస్‌ ¬ల్డర్స్‌ జమాల్‌ దర్వాజ, గోల్ప్‌ క్లబ్‌, సెవెన్‌ టూంబ్సు, సాధారణ పౌరులు ఫతే దర్వాజ, జమలై దర్వాజ వైపు నుంచి వెళ్లాలి.

రాజ్‌భవన్‌ వద్ద ఆంక్షలు

గవర్నర్‌ రాజ్‌భవన్‌లో సాయం త్రం 5.30 గంటలకు ఇచ్చే తేనేటి విందు సందర్భంగా రాజ్‌భవన్‌ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల నుంచి నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ జంక్షన్‌ నుంచి సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం వరకు రోడ్డుకు రెండు వైపులా వెళ్లే సాధారణ వాహనాలు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలి. వీవీఐపీఎస్‌ లైన తెలంగాణ, ఏపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, శాసన మండలి చైర్మన్లు, స్పీకర్లు, కేంద్ర మంత్రులు, రెండు రాష్టాల్ర మంత్రులు. వీరి వాహనాలు గేట్‌ నెం.1 నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి, గేట్‌-2 నుంచి బయటకు రావాలి. ఈ వాహనాలను రాజ్‌భవన్‌ లోపల పార్కు చేయాలి. పాసు కలిగిన ఇతర అతిధులు, గేట్‌ నెం.3 నుంచి లోపలికి వెళ్లి, లోపలే పార్కు చేయాలి. అదే గేటు నుంచి బయటకు వెళ్లాలి. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే వేడుకల సందర్భంగా తివో లి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బండ్‌, ఎన్‌సీసీ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అమలులో ఉంటాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close