‘ముష్టి’ కుటుంబాన్ని పరామర్శించిన :లక్ష్మణ్

0

మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం దూకురులో హతమైన బిజెపి కార్యకర్త ముష్టి ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ పరామర్శించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ గుండాల దాడి లో చనిపోయిన బిజెపి కార్యకర్త కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ప్రకటించారు. చేతికొచ్చిన కొడుకు శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబం పడుతున్న బాధలను చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు .ప్రవీణ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు బిజెపి అండగా నిలుస్తుందని ఆయన భరోసా కల్పించారు. టిఆర్ఎస్ గుండాల ఆగడాలను అరికట్టేందుకు త్వరలోనే కార్యాచరణను రూపొందిస్తామని డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here